Special Status : ప్రత్యేక హోదా పోరు లో రెండు రాష్ట్రాలు...ఇరకాటంలో మోడీ ప్రభుత్వం...!
Special Status : ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సొంతంగా రాని పరిస్థితులను గమనించిన మోడీ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రుల అండతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీహార్ కు ప్రత్యేక హోదా అనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఎన్నో ఏళ్లుగా వెనకబడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా అవసరం అవుతుందని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. అయితే ఎన్ని రోజులు అయిన కూడా అది డిమాండ్ లాగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రత్యేక హోదా పొందాలంటే దీనికి మించిన తరుణం మరొకటి లేదని నితీష్ భావించినట్లుగా పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని కోరుతున్నట్లుగా తీర్మానించారు.
వాస్తవానికి మొన్నటి వరకు నితీష్ ఆర్జెడి కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఎన్డీయే మిత్రుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి 12 మంది జెడియు సభ్యులు ఉన్నారు. వీరిలో జెడియు మూడవ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుంది. దీంతో ఎన్డీయే కు కూటమిలో పోటా పోటీ మెజారిటీ ఉంది. వీటిని గుర్తించిన నితీష్ తమ అవసరాలను గుర్తు పెట్టుకొని కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం చేసి ఈ మేరకు తన డిమాండ్లను చేయగలుగుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీహార్ కి ప్రత్యేక హోదా కావాలని జెడియు సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందని అంటున్నారు. కానీ ఈ ప్రత్యేక హోదాకు కేంద్రంలోని బీజేపీ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే బీహార్ తో పాటు ఇప్పటికే ఒడిస్సా కూడా ప్రత్యేక హోదాను డిమాండ చేస్తుంది.
Special Status : ప్రత్యేక హోదా పోరు లో రెండు రాష్ట్రాలు…ఇరకాటంలో మోడీ ప్రభుత్వం…!
అలాగే ఏపీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది. అంతేకాక ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏపీలోని టీడీపీ తో పొత్తు కలిసి పోటీ చేయడంతో ఈ తరుణమే రాష్ట్ర ప్రత్యేక హోదాకు సమయమని చంద్రబాబు సైతం అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో నితీష్ కుమార్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే విధంగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రెండు రాష్ట్రాల విషయంలో కేంద్రం చర్యలు తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదేవిధంగా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే మోడీ సర్కార్ కి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే చెప్పవచ్చు. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను కేంద్రం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.