
Ashada Masam : ఆషాడ మాసంలో అత్తగారింటికి ఎందుకు వెళ్ళకూడదు... అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....!
Ashada Masam : ఆషాడ మాసం లో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు… ? అలాగే ఆషాడమాసంలో అల్లుడుని ఇంటికి రానివ్వకూడదని అంటారు ఎందుకు..?? అసలు ఆషాడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి..? ఇది అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం . ఆషాడమాసం అనగానే అందరికీ గుర్తు వచ్చేది అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు. అలాగే అల్లుడు అత్తగారింటికి రాకూడదని అంటారు. అసలు పూర్వకాలంలో ఆషాడం లో ప్రతి వ్యక్తి వ్యవసాయం చేసేవారు. ఆషాడమాసం వచ్చేసరికి పంటలు చేతికి వస్తాయి. అలాంటి దాన్ని కంటికి రెప్పలా కాపాడాలి. ఈ సమయంలో రైతు ఉదయం 5 గంటలకె పొలానికి వెళ్లి అక్కడ పని చేసుకోవాలి. ఇక ఆషాడ మాసానికి ముందు పెళ్లిళ్లు చేస్తారు. అలా అల్లుడు ఆషాడంలో ఇంటికి వస్తే మామగారు చనిపోతారు అని అంటారు.
అలాగే అమ్మాయి అత్తగారింటికి పోతే అత్తగారు చనిపోతారు అని అంటారు. కాని నిజానికి ఒకవేళ ఆషాడం మాసంలో అల్లుడు ఇంటికి వస్తే అల్లుడు వచ్చిన సందర్భంగా అత్తమామలు మర్యాదలు పిండి వంటకాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ పంటను మర్చిపోతారు. దీనివల్ల పంట నాశనం అవుతుంది. పంట నాశనం అయితే జీవితం ఉండదు. అందువలన ఆషాడమాసంలో అల్లుడిని ఇంటికి రానివ్వరు. అలాగే కూతురిని అత్తవారింటికి పంపించరు. ఎందుకంటే అత్తవారింట్లో పొలం పనులు చేపిస్తారని తన కూతుర్ని రాచి రంపాలు పెట్టి పొలానికి తీసుకువెళ్తారని . ఇలా అమ్మాయిని అత్తగారింటికి అబ్బాయిని వారి అత్తగారింటికి రానివ్వకూడదని పెద్దలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే ఆషాడం మాసం అయిపోయిన తర్వాత శ్రావణమాసం వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.
Ashada Masam : ఆషాడ మాసంలో అత్తగారింటికి ఎందుకు వెళ్ళకూడదు… అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!
అలాగే కొత్తగా పెళ్లయిన వారిని అత్తగారింటికి పంపిస్తారు. అల్లుడుని కూడా శ్రావణమాసంలోనే తీసుకొస్తారు. దీనివల్ల శుభప్రదమైన పనులు జరుగుతాయని ఆషాడ శ్రావణములకు ప్రాముఖ్యతమైన పరిస్థితులను సాంప్రదాయబద్ధంగా మన పెద్దలు నిర్ణయించారు. అంతేగాని ఆషాడం రోజు అల్లుడు ఇంటికి వస్తే మామగారి కి కీడు అనేది ఏమీ ఉండదు. అదేవిధంగా సిటీలో అల్లుడు ఇంటికి వస్తే ఏమి కాదు ఎందుకు అంటే అక్కడ పంట పొలాలు ఏమి ఉండవు గనుక. నిజానికి ఆషాడమాసం పూర్వంలో పంట పొలాలని కాపాడుకోవడానికి పంటల సంరక్షణ చేయడం కోసం అల్లుడిని ఇంటికి రాకుండా చేయడం కోసం పెట్టిన నియమం మాత్రమే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.