Home » Andhra Pradesh » Bjp Party Leaders Going To Gudivada
andhra pradesh

బిగ్ బ్రేకింగ్: కాసేపట్లో గుడివాడకు బిజెపి, కొడాలి టీం రియాక్షన్ ఎలా ఉంటుందో…?

Authored By
venkat G
The Telugu News | Updated on: January 25, 2022, 12:03 pm
Advertisement

గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. మంత్రి కొడాలి నానీకి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఆడారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్న నేపధ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుంది. ఇక దీనిపై ప్రధాన ప్రతిపక్షం ఎక్కువగా టార్గెట్ చేసి నిజ నిర్ధారణ బృందాన్ని కూడా అక్కడికి పంపింది.

Advertisement

అయితే టీడీపీ బృందం వెళ్ళే క్రమంలో గుడివాడ వైసీపీ తీవ్రంగానే రియాక్ట్ అయింది. టీడీపీ నేతలపై కావాలనే దాడులు చేసారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో అక్కడికి బిజెపి నేతలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బిజెపి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్దమైంది.

అక్కడ ఏం జరిగింది ఏంటీ అనే దాని మీద నిజాలను బయట పెడతామని బిజెపి అంటుంది.దీనితో ఇప్పుడు కొడాలి నానీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి పెరుగుతుంది. టీడీపీ నేతలు తన గుడివాడలో అడుగు పెట్టలేరని కామెంట్ చేసిన నానీ… ఇప్పుడు బిజెపి విషయంలో అంతే ఘాటుగా ఉంటారా…? లేక బిజెపి విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తారా అనే ఆసక్తి పెరుగుతుంది.

venkat G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి