TDP : టీడీపీ సీనియర్ నేత.. విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిజంగానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారా.. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారా.. లేక డ్రామా ఆడుతున్నారా.. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్న ప్రశ్న ఇది. గతంలో ఇలా చాలాసార్లు ఆయన అధిష్టానంపై అలగడంతో.. ఈసారి డ్రామా చేస్తున్నారేమో అని తెలుగుతమ్ములు లైట్ తీసుకుంటున్నారు.. కానీ ఆయన మాత్రం పార్టీ నుంచి తప్పుకోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
దీంతో విషయాన్ని సద్దుమణిగేలా చేయడానికి.. అధిష్టాన బృందం గోరంట్లతో చర్చలు జరిపింది. చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు నేతలు గోరంట్ల ఇంటికి వెళ్లారు. చిన్నరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ ముగ్గురు కలిసి బుచ్చయ్యతో సమావేశం అయ్యారు. రాజమండ్రి సిటీలో సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావుతో గోరంట్లకు విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే, బుచ్చయ్య ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు నేతలను పంపించారు. గంటన్నర పాటు త్రిసభ్య బృందం చర్చలు సాగించాయి. బయటకు ఏం చెపుతున్నా.. గోరంట్ల పార్టీలో కోనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. ఇప్పుడు చర్చలు అవసరం లేదని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం.. మరోవైపు బుచ్చయ్యచౌదరితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో ఇబ్బందులపై గోరంట్ల చెప్పారని, ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా జోక్యం చేసుకుంటారని గద్దె రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. త్వరలో పార్టీలో నెలకొన్న విబేధాలు సర్ధుమణుగుతాయని వెల్లడించారు. బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో కలకలం రేపింది.
తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంతో పాటు ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐతే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదానిపై స్పష్టత లేదు. వేరే పార్టీలో చేరుతారా..? లేక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.