TDP : వేరే పార్టీలో చేరడం కోసమే.. ఈ డ్రామాలా? టీడీపీ సీనియర్ నేత రచ్చ వెనుక అసలు కారణం ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : వేరే పార్టీలో చేరడం కోసమే.. ఈ డ్రామాలా? టీడీపీ సీనియర్ నేత రచ్చ వెనుక అసలు కారణం ఇదేనా?

పట్టు వీడని గోరంట్ల.. TDP : టీడీపీ సీనియర్ నేత.. విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిజంగానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారా.. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారా.. లేక డ్రామా ఆడుతున్నారా.. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్న ప్రశ్న ఇది. గతంలో ఇలా చాలాసార్లు ఆయన అధిష్టానంపై అలగడంతో.. ఈసారి డ్రామా చేస్తున్నారేమో అని తెలుగుతమ్ములు లైట్ తీసుకుంటున్నారు.. కానీ ఆయన మాత్రం పార్టీ నుంచి తప్పుకోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో […]

 Authored By sukanya | The Telugu News | Updated on :21 August 2021,8:30 pm

పట్టు వీడని గోరంట్ల..

TDP : టీడీపీ సీనియర్ నేత.. విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిజంగానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారా.. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారా.. లేక డ్రామా ఆడుతున్నారా.. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్న ప్రశ్న ఇది. గతంలో ఇలా చాలాసార్లు ఆయన అధిష్టానంపై అలగడంతో.. ఈసారి డ్రామా చేస్తున్నారేమో అని తెలుగుతమ్ములు లైట్ తీసుకుంటున్నారు.. కానీ ఆయన మాత్రం పార్టీ నుంచి తప్పుకోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Butchayya Chowdhury of MLA Gorant has really decided to resign

Butchayya Chowdhury of MLA Gorant has really decided to resign

దీంతో విషయాన్ని సద్దుమణిగేలా చేయడానికి.. అధిష్టాన బృందం గోరంట్లతో చర్చలు జరిపింది. చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు నేతలు గోరంట్ల ఇంటికి వెళ్లారు. చిన్నరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌ ముగ్గురు కలిసి బుచ్చయ్యతో సమావేశం అయ్యారు. రాజమండ్రి సిటీలో సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావుతో గోరంట్లకు విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు.

ముగ్గురు TDP  నేతలతో చర్చలు

ఇదిలా ఉంటే, బుచ్చయ్య ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు నేతలను పంపించారు. గంటన్నర పాటు త్రిసభ్య బృందం చర్చలు సాగించాయి. బయటకు ఏం చెపుతున్నా.. గోరంట్ల పార్టీలో కోనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. ఇప్పుడు చర్చలు అవసరం లేదని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం.. మరోవైపు బుచ్చయ్యచౌదరితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో ఇబ్బందులపై గోరంట్ల చెప్పారని, ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.

Butchayya Chowdhury of MLA Gorant has really decided to resign

Butchayya Chowdhury of MLA Gorant has really decided to resign

ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా జోక్యం చేసుకుంటారని గద్దె రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. త్వరలో పార్టీలో నెలకొన్న విబేధాలు సర్ధుమణుగుతాయని వెల్లడించారు. బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో కలకలం రేపింది.

ఏ పార్టీలోకి…

తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంతో పాటు ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్‌ ఆదేశించింది. ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.

 

ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐతే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదానిపై స్పష్టత లేదు. వేరే పార్టీలో చేరుతారా..? లేక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది