Chandrababu : ఎట్టకేలకి వాలంటీర్ వ్యవస్థపై స్పందించిన చంద్రబాబు.. ఉన్నట్టా, లేనట్టా..!
Chandrababu : కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం రీసెంట్‌గా ఓ స్పష్టత అయితే ఇచ్చింది. నేరుగా సీఎం చంద్రబాబే పెన్షన్ల పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు .ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. స్వయంగా పెనుమాకలో లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వాలంటీర్లపై స్పందించారు
వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ సర్కార్.. 33 మంది లబ్దిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేయిస్తున్నామన్నారు. అంతే కాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
Chandrababu : ఎట్టకేలకి వాలంటీర్ వ్యవస్థపై స్పందించిన చంద్రబాబు.. ఉన్నట్టా, లేనట్టా..!
ఇక పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాలంటీర్లు లేకపోతే ఏపీలో పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసీపీ హయాంలో చెప్పారని.. నేడు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునేవారని, ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. మరి సీఎం, డిప్యూటీసీఎంల కామెంట్స్‌ని బట్టి వాలంటీర్స్‌ని అంతగా ఎంకరేజ్ చేయరని అర్ధమవుతుంది.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.