Chandrababu : మంత్రుల విషయంలో చంద్రబాబు సీరియస్.. ఆ ముగ్గురి ప్లేస్ లో కొత్త వారు..?
Chandrababu : తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వం కొత్త మంత్రులను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మొత్తం 25 మంత్రి పదవుల్లో 24 మాత్రమే భర్తీ చేయబడి ఉన్నాయి. అయితే కేవలం ఒక ఖాళీ మాత్రమే ఉన్నా, కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలన్న దృష్టితో ఇప్పటికే ప్రస్తుత మంత్రుల్లో పనితీరు బాగాలేనివారిని తొలగించే యోచనలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Chandrababu : మంత్రుల విషయంలో చంద్రబాబు సీరియస్.. ఆ ముగ్గురి ప్లేస్ లో కొత్త వారు..?
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన నాలుగు జిల్లాల నుండి ప్రస్తుతమున్న మంత్రుల్లో అచ్చెన్నాయుడు మినహా మిగిలిన ముగ్గురిలో ఒకరికి పదవి ప్రమాదంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన తరఫున మంత్రి పదవిలో ఉన్న ఓ నేతను తప్పించి, మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో జనసేనకు నాలుగు మంత్రి పదవులు లభించనుండగా, బీజేపీకి రెండో మంత్రి పదవిని కేటాయించాలన్న ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తుండగా, ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ ఉన్న జనసేన మంత్రి కందుల దుర్గేష్‌కు వేరే శాఖ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఇక టీడీపీ లో పల్లా శ్రీనివాస్ రావుకు, మరికొందరు సీనియర్ నాయకులకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఇటీవల మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకోవడంతో ఎవరికి పదవి కాపాడుకోవాలో, ఎవరు పోగొట్టుకోవాలో స్పష్టత వస్తోంది. అయితే జనసేన తరఫున ఓ మంత్రిని తొలగిస్తే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ చంద్రబాబుకు సవాల్‌గా మారుతున్నప్పటికీ, ఆయన రాజకీయ వ్యూహాలతో దీనిని సమర్థంగా నిర్వహించగలరని టీడీపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్…
BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు…
This website uses cookies.