Chandrababu : కక్ష్య సాధింపులకి సమయం కాదన్న ఆ ముగ్గురు.. నిజంగానే అలా ఉంటారా...!
Chandrababu : ఈ సారి ఏపీ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉంటాయని ముందు నుండి అందరు భావించారు. కాని రిజల్ట్స్ తో పాటు ఎన్నికల ఫలితాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా మారాయి.రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అయితే జూన్ 5 న ఆ విజయాన్ని హర్షిస్తూ టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేశాడు ఓ టీకొట్టు యజమాని. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకే టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పాడు.ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో చోటు చేసుకుంది.
అయితే ఏది ఎలా ఉన్నా కూడా కూటమి నాయకులు ప్రజలకి మంచి చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూటమిని చాలా ఇబ్బంది పెట్టిన కూడా తాము మాత్రం కక్ష సాధింపులకు ఇది సమయం కాదని, రాష్ట్ర పునర్ నిర్మాణమే ప్రధానం అంటున్నారు ..చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్. ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ప్రతిపక్షంపై కక్ష సాధించడం తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు. ”వైసీపీ కానీ, జగన్ కానీ.. వ్యక్తిగతంగా నాకు శత్రువులు కారు. జనసేన నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది కక్ష సాధింపులకు సమయం కాదు. 5కోట్ల మంది ప్రజల కోసం పని చేసే సమయం ఇది” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
Chandrababu : కక్ష్య సాధింపులకి సమయం కాదన్న ఆ ముగ్గురు.. నిజంగానే అలా ఉంటారా…!
”కక్ష సాధింపులు, వేధింపులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం.. మాకు రాదు. మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు. మాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన అవసరం మా మూడు పార్టీలపైన ఉంది. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎవరికీ రాని విజయం, మెజార్టీ మాకు వచ్చింది. మా బాధ్యత మేము నెరవేర్చాలి. హుందాగా, ప్రజలకు ఇక్వ కక్ష్య సాధింపులకి పాల్పడేది లేదు. ప్రజలకి సేవ చేసే విధంగా పని చేస్తాం అని లోకేష్ స్పష్టం చేశారు. కక్ష సాధింపులకు పాల్పడేది లేదు. వ్యవస్థలను కాపాడటమే లక్ష్యం. ప్రజా శ్రేయస్సు కోసమే అధికారం. కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్ ను ఓడించడం కాదు, జగన్ ను వద్దే వద్దు అని ప్రజలు భావించారు. అందుకు ఈ ఫలితాలు నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు. ముగ్గురు నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసారని వాళ్ల మాటల బట్టి అర్ధమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.