Balakrishna : బాలయ్యకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాలయ్యకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : బాలయ్యకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు..!

Balakrishna : 1983 నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఓ కంచుకోటగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 2014 నుంచి వరుసగా మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు. తాజాగా బాలయ్య చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.92.50 కోట్ల నిధులు కేటాయించారు.

Balakrishna బాలయ్యకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు

Balakrishna : బాలయ్యకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు..!

Balakrishna  బాలయ్య నియోజకవర్గానికి భారీగా నిధులు విడుదల చేసిన చంద్రబాబు

అంతేకాకుండా పట్టణానికి ఇంటర్నల్ తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.136 కోట్ల ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.గుడ్డం కోనేరు అభివృద్ధికి అహుడా నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ నిధుల ద్వారా హిందూపురం పట్టణ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి.

నటసింహం బాలకృష్ణ రాజకీయ రంగంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తూ , ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకునే బాధ్యతను టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు, పీఏ వీరయ్యలకు అప్పగించారు. మరోవైపు బాలయ్య తన సినీ కెరీర్‌లో కూడా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్‌లో బిజీ గా ఉన్నారు. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది