Chandrababu Arrest : టీడీపీ అభిమానులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ అరెస్ట్ కాబోతున్న చంద్రబాబు.. ఎందుకంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Arrest : టీడీపీ అభిమానులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ అరెస్ట్ కాబోతున్న చంద్రబాబు.. ఎందుకంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో అరెస్ట్ కాబోతున్న చంద్రబాబు

  •  చంద్రబాబును త్వరలో సీఐడీ అధికారులు మళ్లీ అరెస్ట్ చేయనున్నారా?

  •  ఆ కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ దొరకలేదా?

Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబుకు నిన్ననే రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద ఉన్న చంద్రబాబుకు మళ్లీ రెగ్యులర్ బెయిల్ రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అభిమానులు పండుగ చేసుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా చాలా సంతోషించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు నుంచి ఇక చంద్రబాబు బయటపడ్డట్టే అని అందరూ అనుకున్నారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే.. చంద్రబాబుకు బెయిల్ వచ్చినంత మాత్రాన ఇక కేసుల నుంచి బయటపడినట్టే అని అనుకోవడం తప్పే అవుతుంది. నిజానికి.. ఈ చర్చ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. ఏపీ హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసినా కూడా ఆయన్ను ఇతర కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కామ్ కేసు మాత్రమే కాదు.. చాలా కేసులను నమోదు చేశారు. కొన్ని ఇప్పటికే కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆయన్ను ముందు స్కిల్ స్కామ్ కేసులోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కామ్.. ఇలా చాలా కేసుల్లో ఆయన పేరును యాడ్ చేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత అవినీతి చేశారు.. ఎన్ని కోట్లు దారి మళ్లించారు అనే దానిపై సీఐడీ అధికారులు సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అక్కడ చంద్రబాబును విచారించినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. చంద్రబాబు నుంచి వాళ్లు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబును త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై, ఆయన చేసిన అవినీతిపై పక్కా ఆధారాలను సీఐడీ సేకరించినట్టు తెలుస్తోంది. కావాలని రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చారని.. దాని వల్ల తన సన్నిహితులకు భారీగా లబ్ధి చేకూరిందని సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో హెరిటేజ్ సంస్థ గురించి కూడా సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పేర్లను కూడా చేర్చే అవకాశం ఉంది.

Chandrababu Arrest : హెరిటేజ్ సంస్థ కూడా వేల కోట్ల లాభాలు పొందిందా?

ఈ కేసులో హెరిటేజ్ సంస్థ వేల కోట్ల లాభాలు పొందినట్టు తెలుస్తోంది. అయితే.. రింగ్ రోడ్డే వేయలేదు.. అసలు అవినీతి ఎలా జరుగుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నా.. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి చంద్రబాబును అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఫైబర్ నెట్ కేసు కూడా అంతే. ఇసుక, మద్యం కుంభకోణం, అంగళ్లు అల్లర్లు.. ఇలా చాలా కేసులు చంద్రబాబుపై నమోదు చేయడంతో అసలు ఏ కేసులో ఎప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తారో తెలియడం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కాకపోతే మరో స్కామ్.. ఏ స్కామ్ లో ఎలాంటి చిన్న ఆధారం దొరికినా వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులు చూస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది