cm ramesh to get central minister post
Chandrababu : ఇంకో మూడు నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. అయితే.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పార్టీలో పలు మార్పులు చేసింది. ఎన్నికల వల్ల వేరే రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉంటుంది అని భావించి పలు మార్పులు చేర్పులు చేపట్టింది. తెలంగాణ, ఏపీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చింది బీజేపీ. బీజేపీతో పాటు వేరే పార్టీలు కూడా నాయకత్వంలో పలు మార్పులు చేస్తున్నాయి.
అయితే.. త్వరలో కేంద్రంలో మోదీ కేబినేట్ ను విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినేట్ విస్తరణలో భాగంగా.. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణ, ఏపీలో కూడా ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే.. తెలంగాణలో కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ.. ఆయన్ను బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో ఆయన పదవిని తీసేసి.. బండి సంజయ్ కి కేబినేట్ లో చోటు కల్పించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే కే. లక్ష్మణ్ కు కానీ మోదీ కేబినేట్ లో చోటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రం చోటు దక్కనుంది.ఇక.. ఏపీ నుంచి చూసుకుంటే సీఎం రమేశ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సీఎం రమేశ్ అంతగా బీజేపీలో యాక్టివ్ గా ఉండరు కానీ.. ఆయన పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తుంటారు.
cm ramesh to get central minister post
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ తన వంతుగా కొంత డబ్బు పంపించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ సీనియర్ నేతలు ఎవరు పర్యటించినా సీఎం రమేశ్ దగ్గరుండి చూసుకుంటారు. ఇటీవల అమిత్ షా, జేపీ నడ్డా వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆ వ్యవహారాన్ని సీఎం రమేశ్ చూసుకున్నారు. ఆయనకు బీజేపీ హైకమాండ్ లో మంచి పేరే ఉంది. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం రమేశ్ ఎవరో కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు క్లోజ్ ఫ్రెండ్. ఒకవేళ సీఎం రమేశ్ కు కేంద్ర మంత్రి పదవి వస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుంది. అందుకే టీడీపీ శ్రేణులు తెగ సంతోషంలో ఉన్నారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.