TTD : ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారగా, దీనిపై అధికార ప్రతిపక్షాలు చాలా హడావిడి చేశాయి. ఇక ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదయింది. టీటీడీ ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ ఫిర్యాదు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.6వ తేదీ సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా.. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’ అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో కొన్ని శాఖల అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరు అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష పై చెప్పని విషయాలు కూడా సాక్షి ప్రచురించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో సాక్షి దినపత్రిక యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.