గత కొద్ది రోజులుగా చప్పగా సాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంకి కాస్త ఎనర్జీ అందించారు నిర్వాహకులు. ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపి ఇక చూసుకోండి అన్నట్లుగా గేమ్‌ని మార్చేశారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) అని , వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా పేరు పెట్టారు. ఆరో వారం నామినేషన్స్ విషయంలోనూ బిగ్‌బాస్ బిగ్‌షాకిచ్చాడు. ఇక పోతే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లోకి వచ్చిన వాళ్లకి మాత్రమే నామినేట్ చేసే అధికారం రాగా.. ఒక్క టేస్టీ తేజా, నయని తప్ప.. మిగిలిన వాళ్లంతా యష్మీ గౌడకి గుద్దిపడేశారు.
గంగవ్వ.. యష్మీ, విష్ణు ప్రియలని నామినేట్ చేయగా, నయని పావని.. సీత, విష్ణు ప్రియ, గౌతమ్.. యష్మీ, విష్ణు ప్రియ, మెహబూబ్.. యష్మీ, సీత, రోహిణి.. యష్మీ, విష్ణు ప్రియ, టేస్టీ తేజా.. మణికంఠ, సీతలని నామినేట్ చేయగా, అవినాష్.. యష్మీ, పృథ్వీ, హరితేజ.. యష్మీ, పృథ్వీ లని నామినేట్ చేశారు.ఈ నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా సాగింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు.అయితే గంగవ్వ.. విష్ణు ప్రియని ఓ రేంజ్‌లో ఏసుకుంది. బిగ్ బాస్ షోని ఇప్పుడు అంతగా చూడడం లేదు. మనం ఇక్కడికి వచ్చింది ఆటలు ఆడడానికి, అందరిని ఎంటర్టైన్ చేయడానికి. మనం సందడి చేస్తేనే వాళ్లకి, మనకు నాలుగు డబ్బులు వస్తాయి. మొదటి రెండు వారాలు బాగానే ఆడావు. ఇప్పుడు ఏమైంది. కాళ్లు చేతులు పడిపోయాయా అంటూ ఫైర్ అయింది గంగవ్వ.
దానికి విష్ణు ప్రియ నోరెళ్లపెడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరి గంగవ్వకి విష్ణు ప్రియ ఏమైన కౌంటర్ ఇచ్చిందా,
లేదంటే కూల్‌గా సమాధానం చెప్పిందా అని ఈ రోజు ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌లో షాకింగ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈ వారం ఓటింగ్‌లో టాప్‌లో నిలవడం విశేషం. ఆమెకు 29 శాతం ఓట్లు రాగా.. విష్ణుప్రియకు 20 శాతం, పృధ్వీరాజ్‌కి 16 శాతం ఓట్లు వచ్చాయి. మరో ఓల్డ్ కంటెస్టెంట్ మెహబూబ్‌కి 14 శాతం, యష్మీగౌడకి 14 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఓట్ల సంఖ్యలో మెహబూబ్ ముందున్నాడు. కిరాక్ సీత 7 శాతం ఓటింగ్‌తో లిస్ట్‌లో అట్టడుగున నిలిచారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.