
Devineni Uma : చంద్రబాబు నాయుడు కి బిగ్ షాక్.. వైసీపీలోకి దేవినేని ఉమామహేశ్వరరావు..?
Devineni Uma : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి చేరే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అటు వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పుడు పార్టీలు మారడం అనేది సహజంగా మారింది. ఒకప్పుడు ఒక పార్టీలో చేరితే జీవితకాలం అదే పార్టీలో కొనసాగే వారు. కానీ ఇప్పుడు అధికారం కోసం పార్టీలు మారుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చారు. ఆయన నియోజకవర్గంలో ఆయనకి కచ్చితంగా టికెట్ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీకి దేవినేని ఉమా ఎంతో స్ట్రాంగ్ గా నిలబడ్డారు. గతంలో ఆయన ఇరిగేషన్ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. నందిగామ, మైలవరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. చాలా కాలం నుంచి టీడీపీకి స్ట్రాంగ్ గా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు త్వరలోనే వైసీపీలోకి చేరబోతున్నారని పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో జాయిన్ అవుతున్నప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ లేరట. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులకు దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు మధ్య వివాదాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ వార్ ని చంద్రబాబు నాయుడు ఎలా ఆపగలుగుతారో చూడాల్సి ఉంటుంది. అయితే దేవినేని ఉమాను వైసీపీలోకి చేర్చుకోవాలని పార్టీ హై కమాండ్ ఆలోచిస్తుందని అంటున్నారు. అయితే వైసీపీ క్యాడర్ దేవినేని ఉమా పార్టీలోకి రావడానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దేవినేని ఉమ వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ క్యాడర్ దేవినేని ఉమాను వైసీపీలోకి చేర్చుకోవడానికి సంకోచిస్తున్నారు.
కానీ వసంత కృష్ణ ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇస్తే దేవినేని ఉమా కచ్చితంగా వైసీపీలోకి చేరుతారని అంటున్నారు. ఈ క్రమంలో దేవినేని ఉమ టీడీపీలో ఉంటారా లేక వైసీపీలోకి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హై కమాండ్ వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇస్తే దేవినేని ఉమామహేశ్వరరావు కచ్చితంగా వైసీపీలోకి వస్తారని అంటున్నారు. ఇప్పటికే ఇరువైపులా పార్టీలలో చాలా చేరికలు జరిగాయి. ఇప్పటికే చాలామంది నాయకులు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ అవుతూ వస్తున్నారు. ఇంకా ఈ చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చేరికలు మాత్రం ఆగటం లేదు. ఇప్పుడు దేవినేని ఉమా టీడీపీ నుంచి వైసీపీలోకి మారడం పెద్ద హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. టీడీపీకి ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న నాయకులలో ఒకరైన దేవినేని ఉమా వైసీపీలోకి వెళితే చంద్రబాబు నాయుడుకి పెద్ద షాక్ తగిలినట్లు అవుతుందని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.