కర్నూల్ లో ప్రియుడి భార్య పై పగతో మాజీ ప్రియురాలు ఏంచేసిందో తెలిస్తే..ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని షాక్ అవుతారు !!

ప్రియుడి భార్య పై పగతో మాజీ ప్రియురాలు ఏంచేసిందో తెలిస్తే..ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని షాక్ అవుతారు !!

 Authored By sudheer | The Telugu News | Updated on :25 January 2026,10:30 am

Ex Lover : భర్త మహాశయులకు విజ్ఞప్తి..రోజు రోజుకు అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో భర్తలు హతం అవుతున్నారు. తాజాగా సినిమా ఫక్కీలో జరిగిన ఒక ఘోరమైన కుట్ర కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ Raju weds rambai సినిమాలో తండ్రి తన కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చే క్రూరమైన సీన్‌ను తలపించేలా, ఇక్కడ ఒక మహిళ తన మాజీ ప్రియుడి భార్యపై అదే తరహాలో పగ తీర్చుకోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. వసుంధర అనే మహిళ గతంలో ఒక డాక్టరుతో ప్రేమలో ఉంది. అయితే, సదరు డాక్టర్ మరొక మహిళను (ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్) వివాహం చేసుకోవడంతో, వారిపై వసుంధర తీవ్రమైన కక్ష పెంచుకుంది. ఈ నెల 9వ తేదీన బాధితురాలు తన స్కూటీపై వెళ్తుండగా, వసుంధర పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఆటోతో ఆమెను ఢీకొట్టించింది. ఆ ప్రమాదంలో గాయపడిన బాధితురాలికి సాయం చేస్తున్నట్లు నటించి, అదను చూసి వెంట తెచ్చుకున్న హెచ్ఐవి (HIV) వైరస్ ఉన్న ఇంజెక్షన్‌ను ఆమె శరీరంలోకి ఎక్కించింది. కంటికి కనిపించని వైరస్‌తో ప్రాణాలు తీయాలనుకున్న ఆమె వికృత ఆలోచన అందరినీ భయాందోళనకు గురిచేసింది.

కర్నూల్ లో ప్రియుడి భార్య పై పగతో మాజీ ప్రియురాలు ఏంచేసిందో తెలిస్తేఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని షాక్ అవుతారు

కర్నూల్ లో ప్రియుడి భార్య పై పగతో మాజీ ప్రియురాలు ఏంచేసిందో తెలిస్తే..ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని షాక్ అవుతారు !!

వైద్య రంగంలో ఓ మచ్చ

బాధితురాలికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నికల్ ఎవిడెన్స్ మరియు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరపగా ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వసుంధర కేవలం ఒంటరిగా ఈ పని చేయలేదని, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. నిందితురాలు ఒక వైద్య రంగం గురించి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో, వైరస్ ఇంజెక్షన్‌ను ఎక్కడ సేకరించింది మరియు ఈ కుట్రకు ఎవరెవరు సహకరించారనే కోణంలో లోతైన దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వసుంధరతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

లవ్ ఫెయిల్ అయ్యిందనే కోపం తో ఈ దారుణం

ప్రేమ విఫలమైందన్న కోపంతో ఒక విద్యావంతురాలైన మహిళ ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాణాంతక వైరస్‌ను ఆయుధంగా వాడుకోవడం అనేది అత్యంత భయంకరమైన నేరం. ఈ ఘటనతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితురాలికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆమె ఆరోగ్యంపై నిపుణుల పర్యవేక్షణ ఉందని సమాచారం. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Also read

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది