
Pension : ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. జూన్ నెలలో ఆ విధంగా ఇస్తారంట..!
Pension : ఏపీలో ఇప్పుడు పింఛన్ల విషయం హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి అంతకు ముందు పింఛన్లకు ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఎందుకంటే సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. దాంతో వారంతా ఇండ్లకే వెళ్లి పింఛన్లను ఇచ్చేవారు. అలా పింఛన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పిఛంన్లు ఇవ్వొద్దంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు రావడంతో అధికారులు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆర్డర్ వేసింది.
దాంతో ఏప్రిల్ నెలలో గ్రామ సచివాలయాలలో పింఛన్లు ఇచ్చారు. ఆ సమయంలో వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక మరణించారు. ఆ దెబ్బతో ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయిపోయింది. ఎన్నికల కమిషన్ ను రిక్వెస్ట్ చేసి మే నెలకు సంబంధించిన పింఛన్లను అకౌంట్లలో వేశారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కానీ ఇంకా కోడ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు ఎలా ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. దానిపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Pension : ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. జూన్ నెలలో ఆ విధంగా ఇస్తారంట..!
జూన్ నెల పింఛన్లను నేరుగా వారి అకౌంట్లలోనే వేస్తామని తెలిపింది ప్రభుత్వం. గత నెల మాదిరిగానే వేస్తామని చెప్పింది. అయితే నడవలేని వికలాంగులు, వృద్ధులు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడే వారికి మాత్రం ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఇప్పటికే అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత నెలలో కొంత మంది పింఛన్ దారులు బ్యాంకు ఖాతా వివరాలు విషయంలో ఇబ్బందులు పడ్డారు. కొందరికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడలేదని వాపోయారు. అలాంటి వారి విషయంలో ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఆ విషయం మీద ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అయితే రాలేదు. మరి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
This website uses cookies.