
Good news for Dwakra womens in AP
New DWCRA Schemes 2026 : మహిళా సాధికారతకు మరో ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు కీలక పథకాలను ప్రారంభించనుంది. డ్వాక్రా సంఘాల మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా “ఎన్టీఆర్ విద్యాలక్ష్మి”, “ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి” పేరుతో ఈ పథకాలు అమల్లోకి రానున్నాయి. మహిళల కుటుంబాల్లో విద్య, వివాహ అవసరాలకు తోడ్పడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. మార్చి 3 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుండగా మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు.
New DWCRA Schemes 2026 : డ్వాక్రా మహిళలకు శుభవార్త .. ఒక్కొక్కరికి రూ.లక్ష .. రెండు కొత్త పథకాల ప్రకటన
డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించేందుకు “ఎన్టీఆర్ విద్యాలక్ష్మి” పథకాన్ని రూపొందించారు. స్కూల్ లేదా కాలేజీ ఫీజుల చెల్లింపుల కోసం రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం పొందవచ్చు. కుటుంబంలో ఇద్దరు పిల్లల చదువులకు ఈ రుణం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ రుణాన్ని కేవలం పావలా వడ్డీకే అందించడం విశేషం. 48 సమాన వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు. రుణం పొందాలంటే పిల్లల అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, విద్యాసంస్థ సమాచారం ఇతర రసీదులు సమర్పించాలి. డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే స్త్రీనిధి బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. బయోమెట్రిక్ ఆధారంగా అర్హతను నిర్ధారించి పారదర్శకంగా అమలు చేస్తారు.
డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు “ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి” పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణానికీ పావలా వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. 48 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. వివాహానికి సంబంధించిన లగ్నపత్రిక, ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించిన తరువాత రుణం మంజూరు చేస్తారు. రుణం మంజూరైన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ప్రమాదవశాత్తు లబ్ధిదారు మరణిస్తే రుణాన్ని మాఫీ చేసే ప్రత్యేక నిబంధనను కూడా ప్రభుత్వం చేర్చింది.
ఈ రెండు పథకాల అమలుకు సంవత్సరానికి సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఒక్కో పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం డ్వాక్రా మహిళా సంఘాల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగిలిన 50 శాతం స్త్రీనిధి సంస్థ నిర్వహణ, ఉద్యోగుల అవసరాలకు ఉపయోగిస్తారు. అదనంగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 27,500 యానిమేటర్లు, 5 వేల కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు రూ.15 వేల విలువైన మొబైల్ ఫోన్లు అందించనున్నారు. 600 మంది ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు కూడా ఇవ్వనున్నారు. ఈ చర్యలు గ్రామీణ మహిళా సంఘాల నిర్వహణలో సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కుటుంబాల అభివృద్ధికి ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ వరాలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి.
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
This website uses cookies.