
Farmers : రైతులు జర జాగ్రత్త.. మీ దగ్గర ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య లేకపోతే పథకాలు రావు..!
Farmers : ఏపీలోని రైతులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అన్నదాత, సుఖీభవ, పంటల భీమా వంటివి మీకు అమలు కావాలంటే తప్పక గుర్తింపు సంఖ్య అనేది ఉండాలి. రైతన్నల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, సేవలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు. నకిలీ రైతులు, బినామీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాలలో ఇప్పటికే అన్నదాత వివరాల నమోదు ప్రక్రియ మొదలైంది.
Farmers : రైతులు జర జాగ్రత్త.. మీ దగ్గర ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య లేకపోతే పథకాలు రావు..!
రైతులకి డిజిటల్ గుర్తింపు కార్డు (రైతు విశిష్ట సంఖ్య కార్డ్) ఇవ్వడానికి రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని.. మీ RSK ( రైతు సేవా కేంద్రం )లో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా పొందవచ్చు. దీనికి కాల పరిమితి 28 ఫిబ్రవరి 2025 లోపల పొందుతారు. విశిష్ట గుర్తింపు సంఖ్య ఎందుకు అవసరంటే…(రైతు డిజిటల్ గుర్తింపు కార్డు) విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే మీరు కొన్ని పథకాలకు అర్హులు కారు. బీమా, పీఎం కిసాన్ యోజన, పంటనష్ట పరిహారం, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు, ఎరువుల పై రాయితీలు కావాలంటే తప్పని సరిగా ఈ కార్డు ఉండాలి.
రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలోనే ఈ విశిష్ట సంఖ్య కోసం కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. నిర్దేశిత పోర్టల్‌లో రైతుభూమి వివరాలు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేస్తారు. ఈ నమోదు పూర్తికాగానే రైతుల మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేస్తే నమోదు ప్రక్రియ పూర్తై రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. మరోవైపు రైతులకు జారీ చేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ గుర్తింపు సంఖ్య ఉపయోగపడుతుందని చెబుతున్నారు.. ఈ విశిష్ట సంఖ్య ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు జరుగుతుందని.. అలాగే ఆ రైతులకు పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వ్యవసాయ పరికరాలపై రాయితీలు రావాలంటే గుర్తింపు సంఖ్య తప్పనిసరి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.