Ysrcp : వైసీపీలో కొత్త తలనొప్పి “జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు” అంటున్న జనాలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : వైసీపీలో కొత్త తలనొప్పి “జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు” అంటున్న జనాలు..!!

Ysrcp : వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. వైయస్ జగన్ 2024 ఎన్నికలను గెలిస్తే ఇక రెండు మూడు టరుములు మనమే వస్తామని వైసీపీ నేతలకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ ఎన్నికలను అందరూ చాలా సీరియస్ గా తీసుకొని కష్టపడాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగానే జరగబోయే ఎన్నికలలో టికెట్ల కేటాయింపు ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 August 2023,11:00 am

Ysrcp : వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. వైయస్ జగన్ 2024 ఎన్నికలను గెలిస్తే ఇక రెండు మూడు టరుములు మనమే వస్తామని వైసీపీ నేతలకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ ఎన్నికలను అందరూ చాలా సీరియస్ గా తీసుకొని కష్టపడాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగానే జరగబోయే ఎన్నికలలో టికెట్ల కేటాయింపు ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో ప్రజలలో ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ సరి చేసుకోవడానికి.. రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జనాలు స్థానిక ఎమ్మెల్యే పై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పై వినుకొండ వైసీపీ క్యాడర్ ఫుల్ గుర్రుగా ఉంది. ఇందులో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రజలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దని జగనన్న నాయకత్వం తమకి ఇష్టమైన స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కి టికెట్ ఇస్తే ఓటమి గ్యారెంటీ అని అంటున్నారు.

guntur district vissannapeta ysrcp cader full serious on local ysrcp mla

Ysrcp : వైసీపీలో కొత్త తలనొప్పి “జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు” అంటున్న జనాలు..!!

గెలిచాక స్థానిక సమస్యలు పట్టించుకోకుండా రోడ్లు సమస్యలు కూడా తీర్చలేదని వాపోతున్నారు. ఇందులో భాగంగా “జగనన్న ముద్దు కడుబండి వద్దు” అని విమర్శలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో వైసీపీ కేడర్ ఈ విధంగా వ్యవహరించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది