Janasena Party : జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
ప్రధానాంశాలు:
Janasena Party : జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
Janasena Party : నేడు అనగా మార్చి 14న శుక్రవారం పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న జనసేన పార్టీ కి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం ఉదయం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ ద్వారా 20 మంది అభ్యర్థులను నిలబెట్టిన అన్ని స్థానాలలో విజయడంకా మోగించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన జనసేనని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాభినందనలు తెలియజేశారు.

Janasena Party : జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
Janasena Party డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపునకు జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులతో పాటు గ్రామస్థాయి కార్యకర్తలు అందరు సమిష్టిగా, అంకితభావంతో పని చేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలిపారు.