Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా బయటపడిన ఘటన వెలుగు చూసింది. విద్యార్థినులు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రహస్యంగా కెమెరాలో వీడియోలను రికార్డ్ చేసి, వాటిని లీక్ చేసి కొంతమంది విద్యార్థులకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఘటన విద్యార్థులు, స్థానిక వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. గురువారం సాయంత్రం తమ వాష్‌రూమ్‌లోని రహస్య కెమెరాను విద్యార్థినులు గుర్తించారు. అప్పటినుంచి తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.
ఫొటోలు, వీడియోలు లీక్ కావడంతో చాలా మంది విద్యార్థినులను వాష్‌రూమ్ ను ఉపయోగించడం గురించి భయాన్ని మరియు అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలుర హాస్టల్‌కు చెందిన సీనియర్ విద్యార్థి విజయ్ కుమార్ అనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతడి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహిళల హాస్టల్ వాష్‌రూమ్ కు సంబంధించి 300కి పైగా ఫోటోలు మరియు వీడియోలు లీక్ అయ్యాయి. వాటిని కొంతమంది విద్యార్థులు విజయ్ నుండి కొనుగోలు చేశారు.
విచారణ కొనసాగుతోందని, కెమెరాను ఏర్పాటు చేయడం మరియు వీడియోలను పంపిణీలో మరికొంత మంది విద్యార్థుల ప్రమేయం ఉన్నదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో బెంగళూరులోని ప్రముఖ కాఫీ షాప్‌లోని మహిళల వాష్‌రూమ్ డస్ట్‌బిన్‌లో కస్టమర్ల వీడియోలను రికార్డ్ చేయడానికి దాచిన ఫోన్‌ను కనుగొన్నారు. బ్యాగ్‌లో రంధ్రం ఉన్న కెమెరాను గుర్తించారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ విషయం బహిర్గతం అయింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.