YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసులపై హైకోర్టు సీరియస్
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటనలో, సింగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌ను రెండో నిందితుడిగా (ఏ-2) చేర్చడంపై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా వేస్తారు?” అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసులపై హైకోర్టు సీరియస్
జగన్ తరఫు న్యాయవాదులు ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కారును మొదటగా గుర్తించి, తర్వాత దాన్ని జగన్ కారు అని మారుస్తూ కేసు నమోదు చేశారని వాదించారు. ఇది ప్రజలతో అనుసంధానాన్ని అడ్డుకునేందుకు, పరపతిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసారని కోర్టుకు వివరించారు. అంతేకాదు, జగన్ పర్యటనలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని, ఈ అంశం పైన కూడా రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
వాదనలన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం, ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో కేసును జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో, అప్పటి వరకు జగన్ సహా ఇతర నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.