Mother : 90 ఏళ్ల తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ తల్లి చేసిన పనికి అమ్మా అని పరుగులు..!
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులే వారివల్ల చివరికి అనాథులైపోతున్న వాస్తవాన్ని తేటతెల్లం చేస్తుంది ఈ ఘటన. హైదరాబాద్ మలక్‌పేట్ మూసారాంబాగ్‌కు చెందిన శకుంతలాబాయి (90) కిఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.. భర్తతో చాలాకాలం క్రితమే వేరుపడిన శకుంతలాబాయి, కొడుకుల వెంట ఉండుతూ జీవితాన్ని నెట్టుకొచ్చారు.
Mother : 90 ఏళ్ల తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ తల్లి చేసిన పనికి అమ్మా అని పరుగులు..!
ఆరోగ్యంగా ఉన్నంత కాలం తన పిల్లల కోసం అన్నిరకాలుగా సేవలందించిన ఆమెకు.. చివరికి ఊహించని దురదృష్టం ఎదురైంది. వయసు కారణంగా వారికి సహాయంగా ఉండలేని స్థితికి చేరుకున్న శకుంతలాబాయిని ఆమె ఇద్దరు కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. తల్లిని భారంగా భావించిన వారిని ఇంటి ఆస్తి మాత్రం కావాలనిపించింది. ఇల్లు తమ పేర మీద రాయమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. చివరికి శకుంతలాబాయిని ఇంటి నుంచి వదిలించుకుని, తాళం వేసి వెళ్లిపోయారు.ఇలాంటి దుర్మార్గం ఎదుర్కొన్న శకుంతలాబాయి, తన చిన్న కుమార్తె వద్ద తలదాచుకున్నారు.
తనకు న్యాయం చేయాలంటూ 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు కు ఫిర్యాదు చేశారు. అధికారుల కౌన్సెలింగ్ తర్వాత కొడుకులు తల్లికి ఇల్లు ఇస్తామని అంగీకరించినా, నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. దీంతో శకుంతలాబాయి మళ్లీఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించగా, సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ స్వయంగా రంగంలోకి దిగారు. మూడు రోజుల క్రితం తుది నోటీసు జారీ చేసిన తహసీల్దార్, స్పందన రాకపోవడంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇంటికి చేరుకుని తాళం వేసిన ఇంటిని సీజ్ చేశారు.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.