Hyper Aadi : షూటింగ్స్ అన్ని బంద్… పవన్ కోసమే ప్రచారాలు… హైపర్ ఆది..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,8:00 pm

Hyper Aadi : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రజల దగ్గరకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన, బీజేపీ ప్రజాగలం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక ఈ భారీ బహిరంగ సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా చురుగ్గా పాల్గొంటు అధికార పార్టీపై విస్తృతంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నటుడు కావడంతో ఆయనకు వేల సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన హైపర్ ఆది టాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనం ఇదివరకే చాలా సందర్భాలలో చూశాం. చాలా ఈవెంట్లలో చాలా కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పై హైపర్ ఆదికి ఉన్న అభిమానాన్ని చాలా గొప్పగా చెప్పేవారు.

Hyper Aadi : జనసేన తరఫున పిఠాపురంలో ఆది ప్రచారాలు…

ఈ నేపథ్యంలోనే తాజాగా హైపర్ ఆది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తరపున ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ప్రచారాలు చేసేందుకు నాగబాబుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే నాగబాబు గారు విస్తృతంగా ప్రచారాలు జరుపుతున్నారని తెలిపారు. అంతేకాక మేము ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే కచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తామంటూ ముందే ప్రజలు చెబుతున్నారని ఆది తెలియజేశారు.

Hyper Aadi : షూటింగ్స్ అన్ని బంద్... పవన్ కోసమే ప్రచారాలు... హైపర్ ఆది..!

Hyper Aadi : షూటింగ్స్ అన్ని బంద్… పవన్ కోసమే ప్రచారాలు… హైపర్ ఆది..!

Hyper Aadi : లక్ష మెజారిటీ పక్క..

ఈసారి పిఠాపురం నియోజకవర్గం లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ దక్కుతుందని ఆది తెలిపారు. ఇక జూన్ 4వ తేదీన ఆ రిజల్ట్ కచ్చితంగా అందరూ చూస్తారు అంటూ ఆది తెలిపారు.అంతేకాదు హైపర్ ఆది ఈనెల మొత్తం షూటింగ్స్ ఏమి చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే పని చేస్తానని , ఆయన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే తిరిగి షూటింగ్ కి వెళ్తానంటూ తెలియజేశారు. మరి హైపర్ ఆది చెప్పినట్లుగా రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీని సాధిస్తారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి