TDP : రాజమండ్రిలో ఆ ఫ్యామిలీ గెలిస్తే టీడీపీ ఓటమి ఖాయమట..!
TDP : ఏపీ రాజకీయాల్లో చాలానే సెంటిమెంట్లు ఉన్నాయి. అందులో కొన్ని అనాదిగానే వస్తున్నాయి. ఒక ఫ్యామిలీకి ఒక నియోజకవర్గానికి, ఒక పార్టీకి ఇలాంటి సత్సంబంధాలు కొనసాగుతుంటాయి. ఇప్పుడు రాజమండ్రి విషయంలోకూడా ఇలాంటి సెంటిమెంట్ ఒకటి రిపీట్ అవుతూనే వస్తోంది. అదే రాజమండ్రి నియోజకవర్గ సెంటిమెంట్. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి కుటుంబానికి టీడీపీకి ఓ సెంటిమెంట్ ఉంటుంది. రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబం గెలిస్తే టీడీపీ ఓడిపోతుందనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
టీడీపీలోకి ఆ ఫ్యామిలీ..
2009లో రాజమండ్రి మేయర్ గా గెలిచారు ఆదిరెడ్డి వీరరాఘవమ్మ. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలో ఉంది. అప్పుడు ఆదిరెడ్డి కుటుంబం టీడీపీలో ఉంది. ఇక ఆదిరెడ్డి అప్పారావు 2013లో వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పారావుకు ఛాన్స్ ఇచ్చారు జగన్. అయితే అప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చింది. దాంతో ఆదిరెడ్డి కుటుంబం టీడీపీలోకి వచ్చింది.
ఇక 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి అప్పారావు కోడలు మాజీ దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో లేనంత దారుణంగా టీడీపీ చాలా తక్కువ సీట్లకు పరిమితం అయిపోయింది. కాగా టీడీపీ నుంచి ఇప్పుడు ఆదిరెడ్డి ఫ్యామిలీ తరఫున ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. ఆయన భవానీ భర్త. అతికష్టం మీద ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబం మరోసారి టికెట్ దక్కించుకుంది. కానీ ఈ సారి అక్కడ వాసు గెలిస్తే మాత్రం టీడీపీ కూటమి ఓడిపోవడం ఖాయం అంటున్నారు. చాలా సర్వేలు ఆదిరెడ్డి వాసు గెలుస్తారని చెబుతున్నాయి. దాంతో కూటమి నేతల్లో ఒకింత టెన్షన్ మొదలైంది. మరి రాజమండ్రి సెంటిమెంట్ ఇక్కడ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.