
Pithapuram : పిఠాపురంలో రచ్చ..ఎమ్మేల్యే గారి తాలూకా VS డిప్యూటీ సీఎం గారి తాలూకా..!
Pithapuram : ఏపీలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ఎంత చర్చనీయాంశంగా మారాయో మనం చూశాం. ఇక పిఠాపురం అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఇక్కడి నుంచి పోటీకి దిగడమే దీనికి కారణం. పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఈసారి పవన్ గెలుపుకు ఢోకా లేదనే చర్చ జరుగుతోంది. పవన్ ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు ఎంతోమంది పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పవన్ కు ప్రత్యర్థిగా వైసిపి నుంచి వంగ గీత పోటీ చేశారు.స్థానికంగా బలమైన నాయకురాలు కావడం , మహిళా సెంటిమెంటు ఇవన్నీ కలిసి వస్తాయని ఉద్దేశంతో జగన్ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టారు.
పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురంలో నిర్వహించిన సభలో జగన్ హామీ ఇచ్చా రు.ఇతరులు ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.ఇది ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు వెలబడకుండానే పిఠాపురంలో మరో హడావుడి నడుస్తోంది. ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో గోల గోల చేస్తున్నారు.ఎన్నికల్లో ఆమెకు జగన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం హామీని స్టిక్కర్లుగా మార్చి కార్లపై వేయించుకుని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీనికి పోటీగా మరికొన్ని స్టిక్కర్లు వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఓ జనసేన అభిమాని తన బైక్ పై వేయించిన స్టిక్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Pithapuram : పిఠాపురంలో రచ్చ..ఎమ్మేల్యే గారి తాలూకా VS డిప్యూటీ సీఎం గారి తాలూకా..!
సదరు జనసేన అభిమాని తన బైక్ పై నంబర్ ప్లేట్ స్ధానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్ అతికించాడు. కింద జనసేన గుర్తులతో డిజైన్ కూడా పెట్టుకున్నాడు. తద్వారా పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అనుచరుడనే అర్ధం వచ్చేలా ఈ స్టిక్కరింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రాకముందే పిఠాపురంలో పవన్ గెలిచినట్లే అని భావిస్తున్న అభిమానులు ఇలా తమకు నచ్చిన మార్గాల్లో అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బైక్ స్టిక్కర్ ఫొటో వైరల్ అవుతోంది.పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజార్టీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు.
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
This website uses cookies.