Ys Jagan : ఒక్క సభతో వివేకా హత్యకేసు ఆరోపణలకు ముగింపు పలికిన జగన్..!
ప్రధానాంశాలు:
Jagan : ఒక్క సభతో వివేకా హత్యకేసు ఆరోపణలకు ముగింపు పలికిన జగన్..!
అక్కడితోనే వివేకా హత్య కేసుపై ఆయన ముగింపు పలికినట్టు అర్థం అవుతోంది. తర్వాత సభలో ఆయన దానిపై మాట్లాడుతారనే నమ్మకం కూడా లేదు.
Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అటుప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో సీఎంగా ఉన్న జగన్ కు గెలుపుకు అవకాశాలు ఎంత ఉంటాయో.. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. అందులోనూ జగన్ కు పెద్ద టాస్క్ లాగా మారిపోయింది మాత్రం వివేకా హత్య కేసు అనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా ప్రతిపక్ష పార్టీలు, అటు వివేకా కూతురు సునీత చేస్తున్న ఆరోపనలకు జగన్ ఇన్ని రోజులు మౌనంగానే ఉండిపోయారు.
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రతిపక్షాలు, సొంత కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన మీద ఈ ఆరోపణలు పీక్స్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం జగన్ కు కూడా బాగా తెలుసు. అందుకే వివేకా హత్య కేసుపై సొంత కడప జిల్లాలోనే తన వివరణ ఇచ్చుకున్నారు జగన్. వివేకా నందరెడ్డిని గతంలో ఇదే టీడీపీ విలన్ గా చూపించిందని.. ఇప్పుడు మాత్రం తన బాబాయ్ హత్య కేసును అడ్డుపెట్టుకుని ఫ్యామిలీతో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం జగన్.
అక్కడితోనే వివేకా హత్య కేసుపై ఆయన ముగింపు పలికినట్టు అర్థం అవుతోంది. తర్వాత సభలో ఆయన దానిపై మాట్లాడుతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే జగన్ ఇలా ఒక్క సభతోనే తన బాబాయ్ హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలకు ఇలా చెక్ పెట్టేశారు. అంటే తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని ఇలా మాట్లాడలేదని తెలుస్తోంది. ప్రజలకు తన క్లారిటీ ఇవ్వాలని ఇలా మాట్లాడారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జగన్ వెంబడే ఉంది. వైఎస్సార్ చెల్లెళ్లు కూడా జగన్ కే మద్దతు పలుకుతున్నారు.
మొత్తం 750 మంది కుటుంబ సభ్యులు ఉండే వారంతా కూడా జగన్ వెంటే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు జగన్ కు ఫ్యామిలీ మద్దతు ఉంది. కాబట్టి ఇప్పుడు తాను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఇలా ప్రజలకు ఓ సారి తన వాయిస్ వినిపించి ముగింపు పలికేశారు సీఎం జగన్.