
Janasena : టీడీపీ, వైసీపీ వార్ విషయంలో జనసేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది !
Janasena : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన.. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతంది. వినుకొండ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన కారు మొరాయించడంతో ఆ కారును వదిలి.. వేరే కారులో వినుకొండ బయల్దేరటం.. సోషల్ మీడీయా వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణమైంది. వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను తగ్గించిందంటూ వైసీపీ తొలుత ఆరోపించింది.
వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని.. రిపేర్‌లో ఉన్న వాహనం కేటాయించడంతో అది పలుమార్లు ఆగిపోయిందంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా పలు విమర్శల నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందంగా మారింది. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని బయటకి చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా బయటకు చెప్పేది ఒకటైతే, లోలోపల చేసింది మరొకటిగా ఉండేది.. కట్ చేస్తే ప్రజలే తగిన తీర్పు ఇచ్చారు.. అది వేరే విషయం. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే మాత్రం టీడీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో బొక్కబోర్లా పెట్టించేలా కొన్ని కనబడుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే, కారణం ఏడైనా జరిగింది మాత్రం పాశవిక హత్య అని చెప్పుకోక తప్పదు.
Janasena : టీడీపీ, వైసీపీ వార్ విషయంలో జనసేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది !
వారు ఏ పార్టీకి సంబందించినవారు అయినప్పటికీ జరిగింది మాత్రం దారుణం. ఇదే విషయం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న మాదిరి తయారయింది. ఈ విషయంలో మాత్రం జనసేన అధినేత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా మరోటా అన్నది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో ఇంత బరితెగించి నడి రోడ్డుపైన దారుణమైన హత్య జరగడం అనేది ప్రభుత్వానికే పెద్ద మచ్చగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ సరిచేస్తాం అని చెప్పుకొచ్చారు… మరి ఇపుడు ఈ ఘటనలు ఆయనకి కనబడడంలేదా? అని ఓ వర్గం వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ పెట్టకుండా తరతమ బేధాల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తే
పెద్ద సమస్యలు తెచ్చుకోక తప్పదు.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.