Janasena : టీడీపీ, వైసీపీ వార్ విష‌యంలో జ‌న‌సేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janasena : టీడీపీ, వైసీపీ వార్ విష‌యంలో జ‌న‌సేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది !

Janasena : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన.. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతంది. వినుకొండ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన కారు మొరాయించ‌డంతో ఆ కారును వదిలి.. వేరే కారులో వినుకొండ బయల్దేరటం.. సోషల్ మీడీయా వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణమైంది. వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను తగ్గించిందంటూ […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Janasena : టీడీపీ, వైసీపీ వార్ విష‌యంలో జ‌న‌సేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది !

Janasena : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన.. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతంది. వినుకొండ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన కారు మొరాయించ‌డంతో ఆ కారును వదిలి.. వేరే కారులో వినుకొండ బయల్దేరటం.. సోషల్ మీడీయా వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణమైంది. వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను తగ్గించిందంటూ వైసీపీ తొలుత ఆరోపించింది.

Janasena జ‌న‌సేనాని మౌనం..

వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని.. రిపేర్‌లో ఉన్న వాహనం కేటాయించడంతో అది పలుమార్లు ఆగిపోయిందంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా ప‌లు విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న చందంగా మారింది. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని బయటకి చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా బయటకు చెప్పేది ఒకటైతే, లోలోపల చేసింది మరొకటిగా ఉండేది.. కట్ చేస్తే ప్రజలే తగిన తీర్పు ఇచ్చారు.. అది వేరే విషయం. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే మాత్రం టీడీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో బొక్కబోర్లా పెట్టించేలా కొన్ని కనబడుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే, కారణం ఏడైనా జరిగింది మాత్రం పాశవిక హత్య అని చెప్పుకోక తప్పదు.

Janasena టీడీపీ వైసీపీ వార్ విష‌యంలో జ‌న‌సేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది

Janasena : టీడీపీ, వైసీపీ వార్ విష‌యంలో జ‌న‌సేన ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది !

వారు ఏ పార్టీకి సంబందించినవారు అయినప్పటికీ జరిగింది మాత్రం దారుణం. ఇదే విషయం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న మాదిరి తయారయింది. ఈ విషయంలో మాత్రం జనసేన అధినేత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా మరోటా అన్నది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో ఇంత బరితెగించి నడి రోడ్డుపైన దారుణమైన హత్య జరగడం అనేది ప్రభుత్వానికే పెద్ద మచ్చగా మారింది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా అండ్ ఆర్డర్ సరిచేస్తాం అని చెప్పుకొచ్చారు… మరి ఇపుడు ఈ ఘటనలు ఆయనకి కనబడడంలేదా? అని ఓ వర్గం వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ పెట్ట‌కుండా త‌ర‌త‌మ బేధాల విష‌యంలో చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే
పెద్ద స‌మ‌స్య‌లు తెచ్చుకోక త‌ప్ప‌దు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది