Guru pournami : మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని అంటూ ఉంటారు. భారతీయ విద్యాభ్యాసంలో ఆచార్యునికి ఉండే గౌరవం మహోన్నతమైనది. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతిరూపాలుగా భావించి ఆరాధించే విధానం ప్రఖ్యాతమైనది. మోక్ష ప్రాప్తి కూడా గురువు కృపపైనే ఆధారపడి ఉంది. ధ్యానానికి మూలం గురు స్వరూపం పూజకి మూలం గురుపాదాలు. మంత్రానికి మూలం గురువు మాట మోక్షానికి మూలం గురు అనుగ్రహం. భగవంతుడికి గురువుకి ఏమాత్రం భేదం లేదు. స్వయంగా పరమాత్మ సాక్షకారాన్ని పొంది పరులను ఉద్ధరింప చేసేవాడే గురువు. కాబట్టి గురువు శిష్యుడు సాంప్రదాయం అనేది చాలా విశిష్టమైనది. దీనిని ఏర్పరచిన ఘనత శ్రీ వేద మహర్షి గొప్పతనానికి దక్కుతుంది. అందువలన ఆ మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా భావించి గురువులందరికీ ఆరోజు పూజ చేసే ఆచారం ఏర్పడింది.
ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేచే అవకాశం ఉన్నవారు నది స్నానం చేసి లేదా స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు తలుచుకోవాలి. స్వయంగా గురుదేవుడిని లేదా చక్కగా అలంకరించిన మండపంలో దత్తాత్రేయుని గాని దక్షిణామూర్తిని వేద వ్యాసుడి ప్రతిభను లేదా చిత్రపటాలను ఏర్పాటు చేసుకొని గంధ పుష్పా అక్షితలతో అలంకరచేసి పూజ చేసి నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యాలలో శనగలు తప్పనిసరిగా పెట్టాలి. లేదా శనగపప్పు శనగపిండితో చేసిన పదార్థాలు తప్పకుండా నివేదన చేయాలి. గురువుగా భావించిన వ్యక్తి కి పిండివంటలు నూతన వస్త్ర దక్షిణతో స్మరించి వారి ఆశీస్సులను పొందాలి. అలాగే ఈ రోజున ఇంట్లో గురునామాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. వీలైతే మేడి చెట్టు గాని అశ్వద్ధామ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి. గురు పౌర్ణమి నాడు తప్పనిసరిగా గురువుని స్మరించాలి పూజించాలి. అలాగే ఈరోజు ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి.
ఆషాడ శుద్ధ పూర్ణిమ రోజున అనేక పురాణాలను మనకు అందించిన మహానుభావుడు జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రంథాలకు పూజ చేయాలి. సాక్షాత్తు శ్రీహరే గురు రూపంగా దాల్చిన స్వరూపం వ్యాసుడు. ” శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాషకుతో వందే భగవంతు పూనం పున ” అంటూ వ్యాసుని స్మరించాలి. గురు పౌర్ణమి రోజు ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించడం వలన ఎనలేని శక్తి సంపదలు మీ సొంతమవుతాయి. మీ ఇంట్లో ఎంత దరిద్రం ఉన్నప్పటికీ అన్ని దరిద్రాల తొలగి అదృష్టం పడుతుంది. కావున గురు పౌర్ణమి రోజు ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయడం మంచిది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.