jeevitha rajashekar counter to chiranjeevi
Jeevitha VS Chiranjeevi : ఇప్పుడు కాదు.. సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి రాజశేఖర్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి అస్సలు పడదు. అవును.. అది ఎందుకు అనేది పక్కన పడితే ఈ రెండు కుటుంబాల మధ్య శతృత్వం కొన్నేళ్ల పాటు నడిచింది. చివరకు రాజశేఖర్ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కేవలం మెగా ఫ్యామిలీ వల్లనే జరిగింది. ఇదంతా పక్కన పెడితే జీవిత, రాజశేఖర్ ఇద్దరూ వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలుసు కదా. వీళ్లిద్దరూ వైసీపీలో చేరి ఇప్పుడు వైసీపీకి మద్దతు పలుకుతూ ఏపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జీవిత రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజశేఖర్ ఒక చిన్నపిల్లాడిలా ఉంటారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన మనసులో ఏది ఉన్నా ముందే మాట్లాడేస్తారు. అదే జగన్ విషయంలో జరిగింది. ఏదీ ఎక్కడా ఎవ్వరూ ప్రూవ్ చేసుకోలేదు. అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం చాలా ఈజీ. రాజశేఖర్ ఇలా.. జీవిత ఇలా.. జగన్ గారు ఇలా అంటూ ఆరోపణలు చేయడం చాలా ఈజీ అంటూ జీవిత చెప్పుకొచ్చారు.
ఎదుటి వాళ్ల గురించి ఏదైనా అంటే ఎంజాయ్ చేసేవాళ్లు ఈరోజుల్లో ఎక్కువగా ఉన్నారు. జగన్ గారి మీద వేసిన ఆరోపణలు అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆయన ఎదుగుదల చూశాం. ఆయన పడ్డ కష్టాలు చూశాం. ఆయన జైలుకు వెళ్లడం చూశాం. ఆయన మీద చేసిన ఆరోపణలు అన్నీ ఆరోపణలు గానే మిగిలిపోయాయి. ఆయన జైలు నుంచి బయటికి వచ్చాక కూడా ప్రజల గురించే ఆలోచించారు. పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఆయన చాలా మారిపోయారు. ఆయన ఎంత కష్టపడతారో.. ఆయన్ను చూస్తేనే అర్థం అవుతోంది. ఆయన్ను ఎంత మంది తొక్కేయాలని చూసినా.. ఒక బంతిలా బౌన్సింగ్ బ్యాక్ అవుతున్నారు. అదే ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు అంటూ జీవిత చెప్పుకొచ్చారు.
ఇంత పట్టుదల ఉన్న వ్యక్తి మరోసారి సీఎం కావాలి అంటూ జీవిత చెప్పుకొచ్చారు. జగన్ గారు ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలకు తిండి ఉందా.. కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా అనే దానిపై ఆలోచించారు. వైఎస్సార్ కొడుకుగానే కాకుండా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరుచుకున్నారు జగన్. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు. అందుకే జగన్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. మరోసారి అవకాశం ఇవ్వాలి. జగన్ కు మళ్లీ ఓటు వేసి గెలిపించాలి అని జీవిత స్పష్టం చేశారు.
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
This website uses cookies.