Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: November 21, 2026, 1:10 pm

Jawahar Nagar Indiramma Indlu : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ గ్రామకంఠం పరిధిలోని 330 ఎకరాల్లో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి జవహర్‌నగర్, చంద్రపురి కాలనీ డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!

Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!

పాత పట్టాలు, విద్యుత్ బిల్లులు ఉన్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

జవహర్‌నగర్ గ్రామకంఠం పరిధిలోని 330 ఎకరాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని వజ్రేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ హయాంలో జారీ చేసిన పట్టాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన తెలంగాణ పట్టాలు ఉన్న కుటుంబాల వివరాలను కలెక్టర్‌కు వివరించారు.అలాగే ఇంటి డోర్ నంబర్లు, విద్యుత్ బిల్లులు వంటి నివాస ఆధారాలు కలిగిన పేద కుటుంబాలను పరిశీలించి, అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం కల్పించాలని కోరారు.

Also Read :  Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!

ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.. కలెక్టర్‌కు వజ్రేష్ యాదవ్ విజ్ఞప్తి

గ్రామకంఠం పరిధిలో నివసిస్తున్న ప్రజలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని వజ్రేష్ యాదవ్ కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఇతర ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్‌తో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.జవహర్‌నగర్ గ్రామకంఠం నివాసుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అర్హులైన కుటుంబాలకు ఇళ్ల మంజూరు, నిర్మాణ అనుమతుల అంశాలపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Ramalingaiah Tandu

Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
    1. "Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!"

    2. "Samantha Son : సమంత కొడుకు పేరు ‘దేవ్ నిడిమోరు’.. ఈ అందమైన పేరుకు అర్థం ఏంటో తెలుసా?"

    3. "Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !"

    4. "Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!"

    5. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

    6. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

    7. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp