Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని అభిమానులని ఉత్సాహపరిచిన నారా లోకేష్.. వీడియో !
ప్రధానాంశాలు:
Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని అభిమానులని ఉత్సాహపరిచిన నారా లోకేష్..!
Nara Lokesh Jr Ntr : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించి ఉంది. ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్. ఈ ప్లాంట్ ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.

Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని అభిమానులని ఉత్సాహపరిచిన నారా లోకేష్.. వీడియో !
Nara Lokesh Jr Ntr ఫ్యాన్స్ ఖుష్..
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనాలు అంజేశారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి సమీక్ష మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించారు మంత్రి లోకేశ్.
కొద్ది రోజులుగా లోకేష్, ఎన్టీఆర్‌కి మధ్య విబేదాలు నెలకొన్నాయని జోరుగా ప్రచారం నడిచింది. టీడీపీతో విభేదాలు ఉన్నట్టు కూడా ప్రచారం చేశారు. దానికి చెక్ పెట్టారు లోకేష్.కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నతర్వాత నూజివీడు మండలం సీతారాంపురం వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో నారా లోకేష్
కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
నూజివీడు మండలం సీతారాంపురం వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచిన నారా లోకేష్ pic.twitter.com/L3cDwPqXj0
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025