Laxmi Pranathi : నా భర్తను అనేంత దమ్ముందా.. ఎన్టీఆర్‌ని తిట్టిన రోజా మాటలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laxmi Pranathi : నా భర్తను అనేంత దమ్ముందా.. ఎన్టీఆర్‌ని తిట్టిన రోజా మాటలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతి

 Authored By kranthi | The Telugu News | Updated on :5 August 2023,6:00 pm

Laxmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ వైసీపీ మంత్రి రోజా గురించే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పై ఆర్కే రోజా చేసిన కామెంట్లకు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి చాలా మనోవేదనకు గురయ్యారట. అనంతరం ఆమెకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది లక్ష్మీ ప్రణతి. ఇటీవల రోజా.. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో లక్ష్మీ కోపానికి లోనయి తన భర్త ఒక గ్లోబల్ స్టార్ అని.. ఆయన్ను పట్టుకొని అలాంటి మాటలు అనడం ఏంటని ఆమె అసహనం వ్యక్తం చేశారట.

తన భర్త ఎవ్వరినీ ఏం అనలేదని.. అతడిపై అన్యాయంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోనని లక్ష్మీ ప్రణతి సన్నిహితుల వద్ద అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. తాను సైలెంట్ గా ఉంటున్నా కదా అని ప్రతి ఒక్కరు అవమానించాలని చూస్తున్నారని.. ఇప్పటి దాకా భరించాను కానీ.. ఇప్పుడు పరువు నష్టం దావా ఫైల్ చేయడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారట.ఎన్టీఆర్ ను అవమానించిన ప్రతి ఒక్కరిని నడి బజారుకు లాగుతానని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. భర్త జోలికి వస్తే తీవ్ర పర్యావసనాలు ఎదుర్కోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతిని అభిమానులు బాగా పొగుడుతున్నారు.

JR ntr wife laxmi pranathi warning to roja

JR ntr wife laxmi pranathi warning to roja

Laxmi Pranathi : అవమానించిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తా

సపోర్ట్ వైఫ్ అంటూ మరోసారి నిరూపించుకున్నావు వదిన అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నిజానికి లక్ష్మీ ప్రణతి చాలా ప్రైవేటు వ్యక్తి. పబ్లిక్ గా అస్సలు బయటికి రారు. తన భర్త, పిల్లలు.. అదే ఆమె లోకం. తను పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రీనివాసరావు కూతురు. 2011 లో వీళ్ల పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ప్రణతి చాలా సింపుల్ గా ఉంటారు. తన భర్త కెరీర్ కు చాలా సపోర్ట్ చేస్తారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది