Home » Andhra Pradesh » Kesineni Nani Targets Chandrababu Naidu Government
andhra pradesh

Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 24, 2025, 6:00 pm
Advertisement

Kesineni Nani : విజయవాడ Vijayawada మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొని రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఆయన, తాజాగా తన సోదరుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన స్థానంలో విజయం సాధించిన సోదరుడు చిన్ని పై నాని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఉర్సా క్లస్టర్స్ అనే స్టార్టప్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం 3 వేల కోట్ల విలువైన భూముల కేటాయింపు అంశాన్ని ఎత్తి చూపుతూ ప్రశ్నలు సంధించారు.

Advertisement

Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani : చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీడీపీ మాజీ నేత

ఈ డీల్ వెనుక కేశినేని చిన్ని ప్రమేయం ఉందని నాని ఆరోపించారు. సంస్థలోని ఒక ప్రమోటర్ తన సోదరుడి క్లాస్‌మేట్ అని పేర్కొంటూ, వారి మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా భూములు కేటాయించారని సందేహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా వైజాగ్ ఈజ్ ఫర్ సేల్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అయితే ఈ భూముల్ని దక్కించుకున్న ఉర్సా క్లస్టర్‌కు చెందిన ప్రమోటర్లు జూమ్ కాల్‌లో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము ఎకరా భూమిని 99 పైసలకు తీసుకోలేదని తెలిపారు. ఆ భూమిని మార్కెట్ ధరలకే తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమది కొత్తగా రిజిస్ట్రర్ అయిన కంపెనీ అయినా.. తమ టీమ్‌లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి