#image_title
Bhuvaneswari : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై చివరకు నారా భువనేశ్వరి కూడా బయటికి రావాల్సి వచ్చింది. భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణి కూడా బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలను మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. వాళ్లపై అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టి జైలులో వేస్తున్నారు. అయినా కూడా టీడీపీ నిరసన కార్యక్రమాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా భువనేశ్వరి.. నిరసన కార్యక్రమం నిర్వహించగా.. ఆ కార్యక్రమంలో ఓ బుడ్డోడు హల్ చల్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బుడ్డోడిని చూసి నారా భువనేశ్వరి కూడా షాక్ అయ్యారు. ఆ బుడ్డోడిని చూసి ఫిదా అయ్యారు.
ఆ బుడ్డోడు మైక్ అందుకొని మరీ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రౌడీ రాజ్యం పోవాలని.. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు ఆగాలంటే చంద్రబాబు రాజ్యం రావాలన్నారు. అక్కడ కూర్చొని ఉన్న భువనేశ్వరి లేచి బుడ్డోడితో మాట్లాడారు.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు బయటికి రావాలి. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తున్న నాయకుడు చంద్రబాబు అంటూ ఆ బుడ్డోడు కొనియాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మనకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోసం మీరంతా తరలివచ్చి మద్దతు ఇస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను అన్నాడు ఆ బుడ్డోడు.
#image_title
భార్యాబిడ్డలను చూడకుండా, కాళ్లకు బొబ్బెలు వచ్చినా కూడా యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేష్ ను అభినందనలు తెలుపుతున్నాను. నేను చంద్రన్న కానుకతో పుట్టాను. నేను చంద్రన్నతో కలిసి ప్రజలకు సేవ చేస్తాను. మనం గెలుద్దాం.. మన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిద్దాం. రౌడీ రాజ్యాన్ని ఓడించి చంద్రన్న రాజ్యాన్ని గెలిపిద్దాం అని ఆ బుడ్డోడు చెప్పిన మాటలకు అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యారు. చప్పట్ల మోత మోగించారు.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.