Kolikapudi Srinivasa Rao : తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కొలికపూడి వ్యవహారం రోజురోజుకి టీడీపీ పార్టీకి పెద్ద సమస్యగా మారుతుంది. ఆయన ఈ మధ్య మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ ఒకపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు మరోపక్క సదరు ఎమ్మెల్యే తమ పై లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నాడు అంటూ సొంత పార్టీ మహిళలు రోడ్ ఎక్కి తక్షణమే కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్షలు చేపట్టారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు ఆయన అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కొలికపూడిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
కొలికపూడి కూడా తన పై వస్తున్నా ఆరోపణలు పై టీడీపీ పార్టీ తక్షణమే విచారణ జరిపి తానూ దోషి అని తేలితే శిక్ష ఖరారు చేయాలనీ, లేకపోతె తన పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకోవాలంటూ తానూ కూడా తిరువూరు టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు. అయితే పార్టీ ఆదేశాలతో తన నిరసన దీక్షను విరమించిన కొలికపూడి తాజాగా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారాయి. దీనితో సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సర్వత్రా వ్యతిరేక గళం వినపడుతుంది. ఈ క్రమంలో తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గా కొలికపూడి శ్రీనివాసరావు స్ధానంలో పార్టీలో సీనియర్ నేత శావల దేవదత్ ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
శావల దేవదత్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని వివరాలు తెలియ చేస్తానని చెప్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం శావల దేవదత్ కు ఏం సమాచారం ఇచ్చింది అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రోటో కాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ భాద్యతలు చూడాలని దేవదత్ ను అధిష్టానం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యే ఉండగా మరొకరికి అధికారిక బాధ్యతలు అప్పగించటం అనేది రాష్ట్రంలో ఓ సంచలనంగా చెప్పవచ్చు.ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలను చూస్తూ సైలెంట్ గా ఉంటారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్‌గా మారింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.