Kolikapudi Srinivasa Rao : చంద్ర‌బాబు ఊహించ‌ని నిర్ణ‌యం.. ఎమ్మెల్యే కొలికపూడికి అంత పెద్ద దెబ్బ ప‌డ‌నుందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kolikapudi Srinivasa Rao : చంద్ర‌బాబు ఊహించ‌ని నిర్ణ‌యం.. ఎమ్మెల్యే కొలికపూడికి అంత పెద్ద దెబ్బ ప‌డ‌నుందా ?

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kolikapudi Srinivasa Rao : చంద్ర‌బాబు ఊహించ‌ని నిర్ణ‌యం.. ఎమ్మెల్యే కొలికపూడికి అంత పెద్ద దెబ్బ ప‌డ‌నుందా ?

Kolikapudi Srinivasa Rao : తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కొలికపూడి వ్యవహారం రోజురోజుకి టీడీపీ పార్టీకి పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. ఆయ‌న ఈ మ‌ధ్య మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ ఒకపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు మరోపక్క సదరు ఎమ్మెల్యే తమ పై లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నాడు అంటూ సొంత పార్టీ మహిళలు రోడ్ ఎక్కి తక్షణమే కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్షలు చేపట్టారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు ఆయన అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కొలికపూడిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.

Kolikapudi Srinivasa Rao ఇదే జ‌రిగితే..

కొలికపూడి కూడా తన పై వస్తున్నా ఆరోపణలు పై టీడీపీ పార్టీ తక్షణమే విచారణ జరిపి తానూ దోషి అని తేలితే శిక్ష ఖరారు చేయాలనీ, లేకపోతె తన పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకోవాలంటూ తానూ కూడా తిరువూరు టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు. అయితే పార్టీ ఆదేశాలతో తన నిరసన దీక్షను విరమించిన కొలికపూడి తాజాగా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారాయి. దీనితో సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సర్వత్రా వ్యతిరేక గళం వినపడుతుంది. ఈ క్ర‌మంలో తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గా కొలికపూడి శ్రీనివాసరావు స్ధానంలో పార్టీలో సీనియర్ నేత శావల దేవదత్ ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

Kolikapudi Srinivasa Rao చంద్ర‌బాబు ఊహించ‌ని నిర్ణ‌యం ఎమ్మెల్యే కొలికపూడికి అంత పెద్ద దెబ్బ ప‌డ‌నుందా

Kolikapudi Srinivasa Rao : చంద్ర‌బాబు ఊహించ‌ని నిర్ణ‌యం.. ఎమ్మెల్యే కొలికపూడికి అంత పెద్ద దెబ్బ ప‌డ‌నుందా ?

శావల దేవదత్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని వివరాలు తెలియ చేస్తానని చెప్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం శావల దేవదత్ కు ఏం సమాచారం ఇచ్చింది అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రోటో కాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ భాద్యతలు చూడాలని దేవదత్ ను అధిష్టానం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యే ఉండగా మరొకరికి అధికారిక బాధ్యతలు అప్పగించటం అనేది రాష్ట్రంలో ఓ సంచలనంగా చెప్పవచ్చు.ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలను చూస్తూ సైలెంట్ గా ఉంటారా లేదా అన్న‌ది కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది