Home » Andhra Pradesh » Kotamreddy Sridhar Reddy Joins Janasena Party
andhra pradesh

Kotamreddy Sridhar Reddy : జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

Authored By
Anusha V
The Telugu News | Published on: January 14, 2024, 11:00 am
Advertisement

Kotamreddy Sridhar Reddy : ఆంధ్రప్రదేశ్ లో మరి కొద్ది రోజులలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని వైయస్సార్ సీపీ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తూ, ట్రాన్స్ఫర్ చేస్తూ, కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఇక టీడీపీ జనసేనతో కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లు ఇవ్వకుండా కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. దీంతో సీటు దక్కని వాళ్లు జనసేన, టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది జనసేన, టీడీపీలోకి వెళ్లారు.

Advertisement

ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరారు. నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు జనసేన జిల్లా నేతలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. జనసేన కార్యాలయం కోటం రెడ్డి సోదరులు చేరుకోగానే జనసేన జిల్లా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు మరింతగా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, షకీర్, షేక్ అలియా, కరీం, శ్రీనివాసులు, నాగరాజు, జగదీష్ రెడ్డి, పవన్ యాదవ్, టీడీపీ నేతలు రాజా నాయుడు, ఇందుపురి శ్రీనివాసరెడ్డి, జలదంకి సుధాకర్, పెంచల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి