
Ysrcp : వైసీపీలోకి భారీగా చేరికలు.. టికెట్లు లేకున్నా చేరుతున్న నేతలు..!
Ysrcp : రాజకీయ పార్టీలు అన్న తర్వాత చేరికలు అనేవి కామన్ గానే ఉంటాయి. ఇక రాజకీయ నేతలు కూడా అవసరాలను బట్టి పార్టీలు మారుతుంటారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రాజకీయ అవసరం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరుగుతోంది. కాగా అన్ని పార్టీల్లో కన్నా కూడా వైసీపీలోకి ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న నేతతో పని చేయాలని అనుకోవడం ఇక్కడ కారణం అంటున్నారు.
సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ ఉంటే ఆ పార్టీ టికెట్ కోసం ఇతర పార్టీల నుంచి చేరి మరీ టికెట్ తెచ్చుకోవాలని ఆశపడుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. వైసీపీ అభ్యర్థులను పూర్తిగా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు వైసీపీలో టికెట్లు ఖాళీగా లేవని తెలిసినా సరే చేరికలు మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇదే జగన్ క్రెడిబిలిటీ అని చెబుతున్నారు. జగన్ కు ప్రజల్లో ఆదరణ అలా ఉంది కాబట్టే టికెట్లు లేకున్నా సరే పార్టీలో నడవాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ గత ఐదేండ్లుగా అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు.
చాలా రకాల పథకాలను పెట్టి అన్ని రంగాల్లో ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. పైగా మీకు మేలు జరిగితేనే నాకు ఓట్లేయండి అని అడుగుతున్నారు. సాధారణంగా అవతలి పార్టీకి ఓటేస్తే నష్టపోతారు అని ఓట్లు అడుగుతారు. కానీ జగన్ మాత్రం తన పనితనం నచ్చితేనే ఓట్లేయండి అని అడిగే దమ్ము ఉంది కాబట్టే లీడర్లు వచ్చి చేరుతున్నారని అంటున్నారు. ఇక మంగళవారం ఒక్కరోజే సుమారు 8 నియోజకవర్గాల నేతలు సీఎం జగన్ ని కలిశారు. వీరంతా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం పనిచేస్తామన్నారు.
నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గోపాల్ యాదవ్, సూళ్ళూరుపేట టీడీపీ నేత రామచంద్రారెడ్డి, వెంకటగిరి టీడీపీ నేత మస్తాన్ యాదవ్, రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ గంటా నరహరి, జైభారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైసీపీలో చేరారు.
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
This website uses cookies.