Nara Lokesh : జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి, వైసీపీకి వచ్చిన సీట్లు ఎన్ని?.. జగన్ వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్
ప్రధానాంశాలు:
Nara Lokesh : జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి, వైసీపీకి వచ్చిన సీట్లు ఎన్ని?.. జగన్ వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్
Nara Lokesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఖండించారు. మొన్నటి ఎన్నికల్లో జగన్‌కి వచ్చిన మెజారిటీ ఎంత ? పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజారిటీ ఎంత ? అని ఆయన ప్రశ్నించారు. అలాగే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? జనసేనకి వచ్చిన సీట్లు ఎన్ని అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అదే మాట్లాడి కించపరచడం బాధాకరం అని మంత్రి అన్నారు.

Nara Lokesh : జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి, వైసీపీకి వచ్చిన సీట్లు ఎన్ని?.. జగన్ వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్
Nara Lokesh స్పీకర్ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడుతుంది
వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాము నిబంధనలకు లోబడి పనిచేసేవారమన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తే, అదే జగన్ కు జడ్ ప్లస్ భద్రతను కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్న విషయం తెలిసిందే. బుధవారం మీడియాతో ఆయన ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని ప్రజలు కూడా కోరుకోలేదన్న పవన్ వ్యాఖ్యలపై జగన్ ఆ విధంగా స్పందించారు.