Minister Roja : పవన్ కళ్యాణ్ కి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్.. భారీ న్యూస్ చెప్పిన మంత్రి గారు !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: July 17, 2023, 10:00 am

Minister Roja : ఏపీలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ.. రాజకీయాలు మాత్రం అధికార వైసీపీ, జనసేన మధ్యనే నడుస్తోంది. టీడీపీ కూడా సైడ్ అయిపోయింది కానీ.. వైసీపీపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అసలు వారాహి యాత్రను కేవలం జగన్ ను తిట్టడానికే పెట్టారా అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ఇంకా చేస్తున్నారు కూడా. పవన్ కళ్యాణ్ విమర్శలపై నేరుగానే వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. వెంటనే పవన్ కు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన రూట్ మార్చి ఏకంగా వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలోని ఒంటరి మహిళల డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. టీడీపీ కూడా పవన్ కు మద్దతుగా వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేసింది కానీ.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల పనితీరులో మార్పులు చేస్తామని ప్రకటించింది.

Minister Roja Counter to janasena Chief pawan kalyan and slams chandrababu  naidu in rajamundry | వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా.. పవన్ ఓడిపోతే అదే  చేయాలి.. మంత్రి రోజా సెటైర్లు News ...

Minister Roja : పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా సీరియస్

తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా సీరియస్ అయింది. ఇవి సినిమాలు కాదు. సినిమాల్లో చేసినట్టుగా రాజకీయాల్లో చేస్తే ప్రజలు సహిస్తారా? అసలు పవన్ కళ్యాణ్ మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. ఊగిపోతూ మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా? నేను విప్లవకారుడిని అని పవన్ చెప్పుకుంటాడు కదా. ఇదేనా నీ విప్లవం. విప్లవకారులు ప్యాకేజీ కోసం పని చేస్తారా? పవన్ కళ్యాన్ కు ఫ్యాన్స్ ఉన్నారు కావచ్చు కానీ.. జగన్ కు సోల్జర్స్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఆడుకుంటాం. అసలు జనసేన తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. జగన్ వన్స్ మోర్ అంటూ వచ్చే ఎన్నికల్లో జగన్ ను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp