Roja : దీనికోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. ఈరోజు నాపగ చల్లారింది.. చంద్రబాబు అరెస్ట్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : దీనికోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. ఈరోజు నాపగ చల్లారింది.. చంద్రబాబు అరెస్ట్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

Roja : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్ అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. వైసీపీ నేతలు చాలామంది కూడా చంద్రబాబు అరెస్ట్ ను సంబురాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతుంటే వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండింది అంటున్నారు. ఇక.. ఎప్పుడూ చంద్రబాబుపై సీరియస్ అయ్యే ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా చంద్రబాబు అరెస్ట్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 September 2023,9:00 pm

Roja : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్ అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. వైసీపీ నేతలు చాలామంది కూడా చంద్రబాబు అరెస్ట్ ను సంబురాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతుంటే వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండింది అంటున్నారు. ఇక.. ఎప్పుడూ చంద్రబాబుపై సీరియస్ అయ్యే ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష వేయాలి. చంద్రబాబు అయినా ఇంకెవరు అయినా.. ప్రజల డబ్బును దోచుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది చంద్రబాబుకు తెలియాలి. కరెక్ట్ గా ఈరోజు చంద్రబాబు సాక్షాధారాలతో అడ్డంగా దొరికారు. ఆయనకు స్నేహా బ్యారక్ లో చక్కటి గది ఇచ్చారు. మంచి నెంబర్ కూడా ఇచ్చారు. సీసీ కెమెరాలు పెట్టారు. కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు, అచ్చెన్నాయుడు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో జనాలకు అర్థం కావడం లేదు.. అని రోజా అన్నారు.

minister roja shcking comments on chandrababu

minister roja shcking comments on chandrababu

Roja : అది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు

అది అక్రమ కేసు అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కేసు అది. చదువుకున్న యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ట్రెయినింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో పెద్ద స్కామ్ కు తెరలేపి అడ్డంగా డబ్బులు దోచుకున్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసు అవుతుందా? బాబు వస్తేనే జాబు వస్తుంది అంటూ చెప్పి 2014 లో అధికారంలోకి వచ్చి అనేక స్కామ్ లకు తెరలేపి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో యువత గమనించాలి. 2024 లో టీడీపీకి బుద్ధి చెప్పాలి. జగన్ సీఎం కాగానే 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ ఉద్యోగాలు.. ఇలా యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారు సీఎం జగన్. చంద్రబాబు మాత్రం తన బిడ్డ బాగుంటే చాలు అనుకున్నాడు.. అంటూ రోజా ఫైర్ అయ్యారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది