Roja : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్ అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. వైసీపీ నేతలు చాలామంది కూడా చంద్రబాబు అరెస్ట్ ను సంబురాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతుంటే వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండింది అంటున్నారు. ఇక.. ఎప్పుడూ చంద్రబాబుపై సీరియస్ అయ్యే ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష వేయాలి. చంద్రబాబు అయినా ఇంకెవరు అయినా.. ప్రజల డబ్బును దోచుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది చంద్రబాబుకు తెలియాలి. కరెక్ట్ గా ఈరోజు చంద్రబాబు సాక్షాధారాలతో అడ్డంగా దొరికారు. ఆయనకు స్నేహా బ్యారక్ లో చక్కటి గది ఇచ్చారు. మంచి నెంబర్ కూడా ఇచ్చారు. సీసీ కెమెరాలు పెట్టారు. కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు, అచ్చెన్నాయుడు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో జనాలకు అర్థం కావడం లేదు.. అని రోజా అన్నారు.
అది అక్రమ కేసు అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కేసు అది. చదువుకున్న యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ట్రెయినింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో పెద్ద స్కామ్ కు తెరలేపి అడ్డంగా డబ్బులు దోచుకున్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసు అవుతుందా? బాబు వస్తేనే జాబు వస్తుంది అంటూ చెప్పి 2014 లో అధికారంలోకి వచ్చి అనేక స్కామ్ లకు తెరలేపి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో యువత గమనించాలి. 2024 లో టీడీపీకి బుద్ధి చెప్పాలి. జగన్ సీఎం కాగానే 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ ఉద్యోగాలు.. ఇలా యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారు సీఎం జగన్. చంద్రబాబు మాత్రం తన బిడ్డ బాగుంటే చాలు అనుకున్నాడు.. అంటూ రోజా ఫైర్ అయ్యారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.