
nara-bhuvaneswari-versus-kodali-nani-over-chandrababu-arrest
Bhuvaneswari VS Kodali : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. నిజంగానే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట కార్పొరేషన్ స్కామ్ చేశారా? ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారా? ఐటీ రిటర్న్స్ లో తన ఆదాయం మొత్తాన్ని చూపించలేదా అనేది ఇంకా విచారణలోనే ఉంది. అయితే.. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ మాత్రమే కాదు.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్.. ఇలా చాలా స్కామ్ ల్లో ఇప్పుడు చంద్రబాబు పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుకు ఇంకా బెయిల్ కూడా దొరకలేదు. మరోవైపు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు జైలులో కనీసం సౌకర్యాలు కల్పించడం లేదని టీడీపీ నేతలు, అభిమానులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఎందుకంటే.. వయసు మీదపడ్డ వ్యక్తి అని కనికరం కూడా లేకుండా చంద్రబాబుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మండిపడ్డారు. కనీసం జైలులో చంద్రబాబుకు దోమలు కుడుతున్నా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని భువనేశ్వరి వాపోయారు. చంద్రబాబు కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆమె సవాల్ విసిరారు.
మేము కుటుంబంగా వెళ్లినప్పుడు అక్కడ ఎస్పీ జైలర్ గారి రూమ్ లోనే కూర్చోబెట్టారు. రోజూ ఒక్క లాయర్ మాత్రమే వెళ్తారు. ఆయన ఒక్కడినే పంపిస్తారు. ఒకరోజు ఆయన భోజనం చేస్తా ఉంటే కనీసం టేబుల్ లేదని లాయర్ చెప్పారు. చేతుల మీదనే ప్లేట్ పట్టుకొని భోజనం చేస్తున్నారు. టేబుల్ కావాలంటే కూడా దాని కోసం పర్మిషన్ తీసుకొని లెటర్ రాస్తే టేబుల్ ఇచ్చారు. ఇలా.. ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ఎవ్వరూ చంద్రబాబుని ఏం చేయలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. ఆయన మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని భువనేశ్వరి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. బెయిల్ వస్తదా రాదా.. అంటున్నారు. జైలుకు వెళ్లిన వాడికి బెయిల్ రాదా? ఇప్పుడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి.. నెల రోజులకో బెయిల్ అయితే వస్తుంది కదా అని కొడాలి మండిపడ్డారు.
nara-bhuvaneswari-versus-kodali-nani-over-chandrababu-arrest
చంద్రబాబు మంచి మ్యానుప్ లేటర్. అందరినీ మేనేజ్ చేస్తూ వెళ్తాడు. ఎప్పుడూ ఎవరో ఒకరి కాళ్లు గడ్డం పట్టుకుంటాడు. చంద్రబాబు మేనేజ్ చేసే గుణం ఉన్న వ్యక్తి. అతడికే ఇవన్నీ సాధ్యం అవుతాయి. అందరూ ఎక్కడెక్కడో క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లండన్ లో క్యాండిల్ ర్యాలీ చేసే వాళ్లు ఎవరు.. వాళ్లు ఇక్కడి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లా? అంటూ కొడాలి సీరియస్ అయ్యారు. టీడీపీ ఇప్పుడు కుల పార్టీ. ఇది బలహీన, బడుగు వర్గాల కోసం పెట్టిన పార్టీ అది. ఎన్టీఆర్ అదే సంకల్పంతో పార్టీ పెట్టారు. కానీ.. ఇప్పుడు అది కుల పార్టీగా మారిపోయింది. ఆమెకు 2 శాతం షేర్ అమ్మితే 500 కోట్లు వస్తాయట. వాళ్ల ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ ను ఎవ్వరూ పట్టించుకోరు. మేము అయితే లోకేష్ ను చిత్తు కాగితం మీద కూడా రాయం. వీడు తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా చూస్తూ నిలుచున్నాడు లోకేష్. వాడేం చేస్తాడు. జగన్ ను ఏదో చేస్తాడట. లేపేత్తాడట.. జైలులో దోమలు కుడుతున్నాయని బాధపడుతున్నారు. జైలులో దోమలు కాకుంటే ఇంకేం కుడుతాయి. రంభా, ఊర్వశి వచ్చి కుడతారా? వాళ్లు వచ్చి ఈయనకు కన్ను కొడతారా ఏంటి.. అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.