Narendra Modi : పొత్తు వెనక నరేంద్ర మోడీ భయంకరమైన రాజకీయ వ్యూహం… వై.యస్ జగన్ , చంద్రబాబు పరిస్థితి ఏంటి…?
ప్రధానాంశాలు:
Narendra Modi : పొత్తు వెనక నరేంద్ర మోడీ భయంకరమైన రాజకీయ వ్యూహం... వై.యస్ జగన్ , చంద్రబాబు పరిస్థితి ఏంటి...?
Narendra Modi : ప్రస్తుత కాలంలో ఏ రాజకీయ నాయకుడైన ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకు మంచి చేసే ఆలోచనని వదిలేసి చాలా రోజులవుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా మొదట చెప్పే మాట ఒకటే. అదేంటంటే మేము ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాము. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వారు సరిగా సేవ చేయడం లేదని. కాబట్టి వారి కంటే ఎక్కువ మేము చేసి చూపిస్తాము అంటూ వాగ్దానాలు చేస్తూ వచ్చినవారే. ఈ విధంగా రాజకీయ నాయకులు కబుర్లు చెబుతూ వారి పార్టీ బలాన్ని పెంచుకోవడానికి వీలైనన్ని స్థానాలలో తమ పార్టీ అధికారంలో ఉండడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక దీనిలో బీజేపీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలతో పాటు భారతదేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికలు కూడా బీజేపీ చాలా ముఖ్యమైనవి.అందుకే లోక్ సభలో ఎలాగైనా 300 సీట్లు సాధించాలని గతంలో ఇందిర గాంధీ రికార్డును బ్రేక్ చేయాలని కుదిరితే 400 మార్క్ ను సైతం అందుకోగలగాలని ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్నప్పటికీ చంద్రబాబుతో కలిసి పొత్తులో కొనసాగుతున్నారు అంటే దీని వెనుక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది అని చెప్పాలి.
ఇక ఇది ఒక రాజకీయ వ్యూహం అని కూడా చెప్పొచ్చు. ఇక ఇదే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే రాజకీయపరంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక చాణక్యుడు నరేంద్ర మోడీ. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి కారణాలు లేకుండా ఎందుకుంటాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రకాల అంశాలను వార బయట పెట్టడం జరిగింది. ఇక ఈ కారణాల్లో అన్నిటికంటే ముఖ్యంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ తో బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ లోకి తెలుగుదేశం పార్టీని కనుక చేర్చుకున్నట్లైతే మిత్రపక్షం అవుతుంది. దీంతో 20 సీట్లలో ఒక 15 సీట్లు గెలిచిన దానిలో 3 సీట్లు బీజేపీ సొంతం అయినప్పటికీ జనసేన-1 , మిగతావి తెలుగుదేశం పార్టీ గెలిచినట్లయితే మొత్తం 15 సీట్లు ఎన్డీఏలో కలుస్తాయి. ఈ రకమైనటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు లో భాగంగా ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
ఇక రెండవ కారణం విషయానికొస్తే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఒక సంవత్సరం బీజేపీ మరియు మరొక సంవత్సరం జనసేన నేతలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారట. అయితే ఈ విషయాలను ఇప్పుడు బయట పెట్టలేదు కానీ ఒకవేళ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయం సాధిస్తే ఇదే జరుగుతుందని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. మరి ఈ రాజకీయ విశ్లేషణపై మీకున్న అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.