nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ పోరులో వైకాపా ఘన విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి కలిసి వస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే కూడా ఘోరమైన పరాభవంను తమ పార్టీ అభ్యర్థులు చవి చూస్తున్నారు. కనీసం 30 నుండి 35 శాతం పంచాయితీలను తెలుగు దేశం పార్టీ దక్కించుకుంటుంది అంటూ టీడీపీ భావించినా కూడా 10 శాతంకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైకాపా నాయకులు మోహరించి పంచాయితీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కి ఈ పరిస్థితి రావడానికి కారణం నిమ్మగడ్డ అంటున్నారు.
నిమ్మగడ్డ రమేష్ పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తీరుతాను అంటూ వైకాపాకు ఇష్టం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కోర్టుకు వెళ్లినా కూడా నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో వైకాపా నాయకులు నిమ్మగడ్డ రమేష్ పై పగ పెంచుకున్నారు. ఆ కోపంను ఎన్నికల సందర్బంగా చూపించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సూచించారు. నిమ్మగడ్డ రమేష్ ను దెబ్బ తీసే విధంగా ఆయన మద్దతుగా నిలుస్తున్న టీడీపీకి షాక్ ఇచ్చేలా పంచాయితీ ఫలితాలు ఉండాలని వైకాపా నాయకులు బలంగా కోరుకున్నారు. అందుకే ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు కూడా రంగంలోకి దిగి పంచాయితీ పోరును దగ్గరుండి పరిశీలించారు. తమ వారు గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు.
వైకాపా రాజకీయం పంచాయితీల్లో పని చేసింది. ఒక వైపు అభివృద్ది కోసం వైఎస్ జగన్ పనులు మొదలు పెడుతు ఉంటే మరో వైపు తెలుగు దేశం పార్టీ ఎన్నికలు కావాల్సిందే అంటూ పట్టు బట్టి నిమ్మగడ్డతో నోటిఫికేషన్ ఇప్పించారు అంటూ గ్రామాల్లో ప్రచారం చేశారు. తాము రేషన్ వాహనాలను తీసుకు వస్తే వాటిని తెలుగు దేశం పార్టీ నాయకులు బయటకు వెళ్ల కుండా చేశారు. ఇలా రకరకాలుగా గ్రామాల్లో వైకాపా నాయకులు టీడీపీపై ప్రచారం చేయడంతో వారిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే మెజార్టీ పంచాయితీలు వైకాపా వశం అయ్యాయి అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.