ys sharmila : తెలంగాణలో వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా మారింది. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లా నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఆ తర్వాత పలు జిల్లాల నాయకులతో డైరెక్ట్ గా లేదా వీడియో చాట్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది చాలా మంది వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ ను పూర్తిగా భూ స్థాపితం చేయడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల పార్టీ పెడితే అది మాకే కలిసి వస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలు దక్కించుకుంటాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ మరియు బీజేపీకి మాత్రమే కాకుండా షర్మిలకు కూడా దక్కడం వల్ల ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో సరికొత్తగా ఫలితాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంను దక్కించుకోవడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల పార్టీ పెడితే మాకే లాభం కలుగుతుందని పిచ్చి లాజిక్ ను చెబుతున్నారు.
షర్మిల పార్టీ పెడితే ఇప్పటికే మూలుగుతూ ఉన్న కాంగ్రెస్ పై తాటి పండు పడ్డట్లే అంటూ టాక్ వినిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. కాని కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల కు మూలం కాంగ్రెస్. ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు కనుక ఆమె కూడా కాంగ్రెస్ కుటుంబంకు చెందిన వ్యక్తి అవుతుంది. ఒక వేళ ఆమె పార్టీ పెట్టినా కూడా ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిపి వేయాల్సిందే అనేది వారి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ నుండి ఇలాంటి పిల్ల కాంగ్రెస్లు ఎన్నో పుట్టుకు వచ్చాయి. అయినా కూడా వాటికి అంతగా ఆధరణ దక్కలేదు. దాంతో మళ్లీ కాంగ్రెస్లో కలిసి పోయారు. ఇప్పుడు షర్మిల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఆమె కాంగ్రెస్ లోకి రావాల్సిందే అప్పుడు తామే అధికారంలోకి వస్తామంటూ పిచ్చి లాజిక్ చెబుతున్నారు. ఈ లాజిక్ ఏంటో వారికి అయినా అర్థం అయ్యిందో కాలేదో తెలియదు. ఇలా ఆలోచించడం వల్లే వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అంటూ నెటిజన్స్ కాంగ్రెస్ నాయకులపై కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.