nimmagadda ramesh : పంచాయితీలో వైకాపా జోరుకు నిమ్మగడ్డ కారణం.. విడ్డూరంగా ఉన్నా ఇది నిజం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

nimmagadda ramesh : పంచాయితీలో వైకాపా జోరుకు నిమ్మగడ్డ కారణం.. విడ్డూరంగా ఉన్నా ఇది నిజం

nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ పోరులో వైకాపా ఘన విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి కలిసి వస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే కూడా ఘోరమైన పరాభవంను తమ పార్టీ అభ్యర్థులు చవి చూస్తున్నారు. కనీసం 30 నుండి 35 శాతం పంచాయితీలను తెలుగు దేశం పార్టీ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :18 February 2021,2:30 pm

nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ పోరులో వైకాపా ఘన విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి కలిసి వస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే కూడా ఘోరమైన పరాభవంను తమ పార్టీ అభ్యర్థులు చవి చూస్తున్నారు. కనీసం 30 నుండి 35 శాతం పంచాయితీలను తెలుగు దేశం పార్టీ దక్కించుకుంటుంది అంటూ టీడీపీ భావించినా కూడా 10 శాతంకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైకాపా నాయకులు మోహరించి పంచాయితీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కి ఈ పరిస్థితి రావడానికి కారణం నిమ్మగడ్డ అంటున్నారు.

nimmagadda ramesh is the reason for ysrcp win in panchayathi elections

nimmagadda ramesh is the reason for ysrcp win in panchayathi elections

నిమ్మగడ్డ గొడవతో పెరిగిన పంథం..

నిమ్మగడ్డ రమేష్‌ పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తీరుతాను అంటూ వైకాపాకు ఇష్టం లేకుండానే నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. కోర్టుకు వెళ్లినా కూడా నిమ్మగడ్డ రమేష్‌ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో వైకాపా నాయకులు నిమ్మగడ్డ రమేష్‌ పై పగ పెంచుకున్నారు. ఆ కోపంను ఎన్నికల సందర్బంగా చూపించాలని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సూచించారు. నిమ్మగడ్డ రమేష్‌ ను దెబ్బ తీసే విధంగా ఆయన మద్దతుగా నిలుస్తున్న టీడీపీకి షాక్ ఇచ్చేలా పంచాయితీ ఫలితాలు ఉండాలని వైకాపా నాయకులు బలంగా కోరుకున్నారు. అందుకే ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు కూడా రంగంలోకి దిగి పంచాయితీ పోరును దగ్గరుండి పరిశీలించారు. తమ వారు గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు.

nimmagadda ramesh : ప్రజల్లో వైకాపాపై పాజిటివ్‌ స్పందన..

వైకాపా రాజకీయం పంచాయితీల్లో పని చేసింది. ఒక వైపు అభివృద్ది కోసం వైఎస్‌ జగన్‌ పనులు మొదలు పెడుతు ఉంటే మరో వైపు తెలుగు దేశం పార్టీ ఎన్నికలు కావాల్సిందే అంటూ పట్టు బట్టి నిమ్మగడ్డతో నోటిఫికేషన్‌ ఇప్పించారు అంటూ గ్రామాల్లో ప్రచారం చేశారు. తాము రేషన్ వాహనాలను తీసుకు వస్తే వాటిని తెలుగు దేశం పార్టీ నాయకులు బయటకు వెళ్ల కుండా చేశారు. ఇలా రకరకాలుగా గ్రామాల్లో వైకాపా నాయకులు టీడీపీపై ప్రచారం చేయడంతో వారిలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే మెజార్టీ పంచాయితీలు వైకాపా వశం అయ్యాయి అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది