Home » Andhra Pradesh » Pawan Kalyan And Chandrababu Gets Good Weapon
andhra pradesh

AP Politics : కూటమి చేతికి బ్రహ్మాస్త్రం.. పవన్, చంద్రబాబు రెచ్చిపోతారు

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: February 25, 2026 7:22 pm
Advertisement

AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను తుఫాను సృష్టిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల పవిత్రతను ఏ విధంగా కాలరాశారో ఆధారాలతో సహా బయటపెట్టడంతో, ఇది కూటమి ప్రభుత్వం చేతిలో ఒక శక్తివంతమైన ‘బ్రహ్మాస్త్రం’లా మారింది. కోట్ల మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ అంశంపై చంద్రబాబు, పవన్ ఇక ఏమాత్రం తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ అండ్ కోను రాజకీయంగా సమాధి చేసేందుకు ఈ ఒక్క అస్త్రం చాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

Advertisement

AP Politics : కూటమి చేతికి బ్రహ్మాస్త్రం.. పవన్, చంద్రబాబు రెచ్చిపోతారు

AP Politics అసెంబ్లీలో వైసీపీకి షాక్!

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం తిరుమల కొండను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసిందని మండిపడ్డారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ల్యాబ్ రిపోర్టులను సభ ముందు ఉంచుతూ, “ప్రజల నమ్మకంతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదు” అని హెచ్చరించారు. కేవలం తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక ఉన్న అవినీతిని ఆయన ఎండగట్టారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ ప్రభుత్వం పాపం పండిందని, ఈ విషయంలో విచారణ జరిపించి దోషులను పాతాళంలో ఉన్నా వదిలిపెట్టబోమని భీష్మించుక కూర్చున్నారు.

Advertisement

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు” అంటూ అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవుడి ప్రసాదంలో కల్తీ జరగడం అనేది కేవలం ఒక తప్పు కాదు, అది ఒక ఘోరమైన అపరాధమని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని కొందరు నేతలు తిరుమలను తమ సొంత ఆస్తిలా భావించి, అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మంపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని పవన్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆవేశం చూస్తుంటే, ఈ ఇష్యూని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళ్లి వైసీపీని కట్టడి చేసేలా కనిపిస్తున్నారు.

నిజానికి రాజకీయం ఎప్పుడూ సెంటిమెంట్ల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు లడ్డూ నెయ్యి కల్తీ అంశం సామాన్య భక్తుడిని తీవ్రంగా కలిచివేసింది. వైసీపీ నేతలు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా, అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ ప్రయోగించిన ఈ అస్త్రం ముందు అవి నిలవడం లేదు. ప్రజల్లో వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని వదులుకోకుండా, నిరంతరం చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. అసంబ్లీ లో స్ట్రాంగ్  ప్రసంగాలతో వైసీపీని డిఫెన్స్‌లో పడేసిన చంద్రబాబు, పవన్.. రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని మరింత ఉధృతం చేస్తారనడంలో సందేహం లేదు. హిందూ ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపు తిప్పుకోవడమే కాకుండా, వైసీపీ పరువును గంగలో కలిపేలా కూటమి వ్యూహాలు పన్నుతోంది.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి